Revanth Reddy: కేబినెట్ విస్తరణకు సిద్ధమైన రేవంత్.. వారికి ఛాన్స్!

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వాకిటి శ్రీహరి ముదిరాజ్, పి.సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్‌ కు మంత్రివర్గంలో చోటు ఖాయమని తెలుస్తోంది.

author-image
By Nikhil
New Update

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మరో సారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని రేవంత్ కలవనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎంఓ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని స్పంద్రించింది. పీఎం అపాయింట్మెంట్ ను కోరింది. మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సైతం ఈ పర్యటనలో సీఎం కలవనున్నారు. తెలంగాణలో జరిగిన వరద నష్టంపై నివేదిక సమర్పించనున్నారు. అనంతరం రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కోరునున్నారు. రేవంత్ తో పాటు ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ సైతం ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే.. సోనియాగాంధీ అపాయింట్మెంట్ ను సైతం రేవంత్ కోరినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ నుంచి రాగానే..

పీసీసీ చీఫ్‌ నియామకం పూర్తి కావడంతో నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణపై సీఎంతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన జాబితాను ఖరారు చేసుకుని సీఎం వస్తారన్న ప్రచారం సాగుతోంది. రేవంత్ ఢిల్లీ పర్యటన నుంచి రాగానే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో మరో ఆరుగురిని తీసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం 4 మాత్రమే భర్తీ..
అయితే.. ప్రస్తుతం కేవలం 4 స్థానాలనే భర్తీ చేసి మిగతా రెండు బెర్తులను ఖాళీగా ఉంచాలన్నది రేవంత్ వ్యూహంగా తెలుస్తోంది. వాకిటి శ్రీహరి ముదిరాజ్, పి.సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్‌కు మంత్రివర్గంలో చోటు దాదాపు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి కోసం జోరుగా ప్రచారం చేస్తున్నారు.

కోమటిరెడ్డికి ఛాన్స్ దక్కేనా?
వీరితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తనకు కేబినెట్ లో ఛాన్స్ పక్కా అన్న ధీమాతో ఉన్నారు. తనకు హోంమంత్రి పదవి కూడా వస్తుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే సమయంలో తనకు మంత్రి పదవిపై కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చిందని.. విస్తరణలో తనకు చోటు తప్పనిసరిగా దక్కుతుందని ఆయన అనుచరుల వద్ద వ్యాఖ్యనిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మైనార్టీ నుంచి మంత్రివర్గంలో ఇంత చోటు దక్కలేదు. దీంతో ఈ కోటాలో షబ్బీర్ అలీ, అజారుద్దీన్ లో ఒకరు లేదా ఇద్దరికీ ఛాన్స్ దక్కే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

Also Read :  పార్టీని గాడిలో పెడుతా.. RTVతో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్!

Advertisment
తాజా కథనాలు