Civil Services results: 5సార్లు ఓడినా.. వదల్లే ఆరోసారి AIR 68వ ర్యాంక్ కొట్టిన మన తెలుగోడు

మంళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన సాయి చైతన్య ఆల్ ఇండియా 68ర్యాంక్ సాధించాడు. అతని తండ్రి కానిస్టేబుల్, తల్లి గవర్నమెంట్ టీచర్. 5సార్లు ఫెయిల్ అయినా పట్టువదలకుండా సాయి ఆరో సారి సక్సెస్ అయ్యాడు.

New Update
UPSC ranker sai

ఐఏఎస్ అధికారి అవ్వడం అంటే ఆశామాషీ కాదు. కఠోర దీక్ష, పట్టుదలతో చదవాలి. అందులోనే ఆల్ ఇండయా ర్యాంక్ కొట్టాడంటే దాని వెనుక ఎంతో కష్టం ఉండి ఉంటది. ఓసారి ఓడిపోతేనే నిరుత్సాహ పడే ప్రస్తుత యువత సాయి చైతన్య సక్సెస్ స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఐదుసార్లు సివిల్స్ ఫెయిల్ అయినా.. పట్టువదలకుండా చదివి ఆరుసారి ఐఏఎస్ అయ్యాడు. మంగళవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో సాయి చైతన్య ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. అదిలాబాద్ ఏజెన్సీ ఏరియా నుంచి ఆల్ ఇండియా 68వ ర్యాంక్ సాధించిన యువకుడి సక్సెస్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.. 

Also read: ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

సాయి చైతన్య తండ్రి కానిస్టేబుల్. తల్లి టీచర్. చదువుకున్న వారికే చదువు విలువ తెలుస్తోంది. తల్లిదండ్రుల ప్రభుత్వ ఉద్యోగులే కదా.. అని తాను కష్టపడకుండా కూర్చోలేదు సాయి చైతన్య. పేరెంట్స్ కూడా అతన్ని  ఉన్నత స్థాయిలో చూడాలని ప్రోత్సహించారు. దాన్ని సాయి చైతన్య సద్వినియోగం చేసుకున్నాడు. పడిపడి లేచే కెరటంలో పోరాడి చివరికి ఆల్ ఇండియా స్థాయిలో సత్తా చాటాడు.

Also read:BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

సాయి చైతన్య సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 68వ ర్యాంక్ సాధించాడు. తల్లి గవర్నమెంట్ టీచర్, తండ్రి కానిస్టేబుల్ అని కాలు మీద కాలు వేసుకొని సుఖాలు అనుభవించలేదు. తనకంటూ సొంత గుర్తింపు కోసం పోరాడి అందులో గెలిచాడు. అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్‌ గ్రామానికి చెందినవాడు.  సివిల్స్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ రావడం ర్యాంకు రావడం ఆరేళ్ల కష్టానికి దక్కిన ఫలితమని సాయి చైతన్య అంటున్నాడు. పేదల కోసం గవర్నెన్స్ లో భాగం అవుతానని చెప్పాడు కాబోయే కలెక్టర్ సాయి చైతన్య.

Also read : Official బిగ్ బ్రేకింగ్: యూపీలో అఘోరీ అరెస్ట్

(upsc-results | adilabad | civil-services | upsc-civil-services | upsc-civil-services-exam-results)

Advertisment
తాజా కథనాలు