Crime News : వరంగల్‌లో యువకుడి కిడ్నాప్‌ నాటకం..తండ్రికి ఫోన్‌ చేసి....

వరంగల్ నగరంలో ఓ యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఈ ఘటన మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం సుమారు ఏడు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. అబిత్ కుమార్ అనే యువకుడిని  గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తెలియడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

New Update
Kidnap

Kidnap

Crime News: వరంగల్ నగరంలో ఓ యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఈ ఘటన మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జకోటియా బిల్డింగ్ వద్ద సోమవారం సాయంత్రం సుమారు ఏడు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. అబిత్ కుమార్(అదిత్‌ సోని) అనే యువకుడిని  గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తెలియడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతేకాక అబిత్ కుమార్ తండ్రి అశోక్‌కు కిడ్నాపర్లు ఫోన్ చేసి రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది.  దీంతో ఆందోళనకు గురైన అశోక్‌ తన కుమారుడి కిడ్నాప్‌పై మట్టేవాడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నగరంలో ఉన్న సీసీ ఫుటేజ్‌లను  పరిశీలించారు.   ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశారనే వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో చర్చనీయాంశమైంది. అయితే.. ఆ తర్వాత అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు.

ఇది కూడా చూడండి:Dhoni The Chase Teaser: M.S ధోని ఊరమాస్ టీజర్.. యాక్టింగ్ గూస్‌బంప్స్

విశ్వసనీయ సమాచారం ప్రకారం..వరంగల్‌ నగరానికి చెందిన అశోక్‌ అనే వ్యాపారి తన కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక అశోక్‌ మైదాన్‌ సమీపంలో తన కుమారుడు అదిత్‌సోని(32)  సోమవారం సాయంత్రం ఏడు గంటల సమీపంలో కిడ్నాప్‌కు గురయ్యాడని ఆందోళన  వ్యక్తం చేస్తూ ఆయన మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తుతెలియని నెంబరు నుంచి ఫోన్‌ చేసి రూ.10 లక్షలు తీసుకొని ఓ ప్రాంతానికి రావాలని చెప్పారని ఆయన పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా పోచమ్మ మైదాన్‌ పరిసరాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించారు. అయితే అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో అశోక్‌కు వచ్చిన కాల్స్ లిస్ట్‌ పై దృష్టి సారించారు. అశోక్‌కు కిడ్నాపర్‌ నుంచి వచ్చిన కాల్ పై దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా కాల్‌ వచ్చిన ప్రాంతాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో హనుమకొండ శివారులో కిడ్నాపర్‌ ఉన్నట్లు గుర్తించి దాడి చేశారు. కాగా, అక్కడ ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం  వారిద్దరినీ వరంగల్‌ ఏఎస్పీ శుభం ప్రకాశ్‌ ఎదుట హాజరుపరిచారు. 

అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరు యువకుల్లో ఫిర్యాదు చేసిన అశోక్‌ కుమారుడు అధిత్‌సోని కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేవలం డబ్బు కోసమే అధిత్‌సోని తన స్నేహితుడితో కలిసి కిడ్నాప్‌ నాటకం ఆడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా అబిత్ కుమార్ (అదిత్‌ సోని) బెట్టింగ్‌లు పెట్టి పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలైనట్లు తెలుస్తోంది. తన తండ్రికి విషయం చెబితే డబ్బులు ఇవ్వడని భావించిన యువకుడు  తండ్రి నుంచి ఎలాగైనా నగదు లాగాలని కిడ్నాప్‌ కథ అల్లినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారికంగా పోలీసులు  పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. కాగా పోలీసులు కిడ్నాప్‌  కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. 

Also Read: ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే ఆర్థిక సాయం.. వెలుగులోకి సంచలన నిజాలు

Advertisment
తాజా కథనాలు