Software Engineer: ప్రేమెంత పనిచేసే నారాయణ...లవ్‌లో ఫెయిలై స్మగ్లర్‌గా మారిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఒకమ్మాయిని ఎంతగానో ప్రేమించాడు. కానీ, అనుకోని కారణాలతో ఆమెతో బ్రేక్‌అఫ్‌ అయింది. మనోడు దేవదాసయ్యాడు. మందుతో పాటు డ్రగ్స్‌ అలవాటయ్యింది. చివరికి ఆ డ్రగ్స్‌ విక్రయిస్తూనే పోలీసులకు చిక్కాడు.

New Update
A software engineer who failed in love and became a smuggler

A software engineer who failed in love and became a smuggler

Software Engineer:  కొన్ని ప్రేమలు రోజుల్లోనే ముగుస్తాయి. మరికొన్ని ప్రేమలు సినిమా కథను తలపిస్తున్నాయి. నిజమైన ప్రేమ విఫలమైతే మాత్రం వారు మానసికంగా కుంగిపోతారు. ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కూడా అంతే. తను ఒకమ్మాయిని ఎంతగానో ప్రేమించాడు. కానీ, అనుకోని కారణాలతో ఆమెతో బ్రేక్‌అఫ్‌ అయింది. మనోడు దేవదాసయ్యాడు. మందుతో పాటు డ్రగ్స్‌ అలవాటయ్యింది. చివరికి ఆ డ్రగ్స్‌ విక్రయిస్తూనే పోలీసులకు చిక్కాడు.

Also Read: అసలెక్కడా లేని దేశం...దానికో రాయబార కార్యాలయం..ఘజియాబాద్ లో హైటెక్ మోసం

పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కథనం ప్రకారం.. గాజులరామారానికి చెందిన హర్షవర్థన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అతను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. కానీ, అందులో విఫలమయ్యాడు. దీంతో మద్యానికి బానిసయ్యాడు. స్నేహితులతో కలిసి పబ్‌లకు వెళ్లేవాడు. అతడికి ఓజీ కుష్‌ (గంజాయి) అలవాటైంది. ఈ క్రమంలో  డ్రగ్స్‌కు బానిసైయ్యాడు. దానికోసం  గోవా, బెంగళూరు వెళ్లేవాడు. అక్కడ నైజీరియన్‌ స్మగ్లర్స్‌తో పరిచయం పెంచుకుని తానూ స్మగ్లర్‌గా మారాడు.గోవాకు వెళ్లి డ్రగ్స్‌ కొనుగోలు చేసి, హైదరాబాద్‌ తీసుకొచ్చి ఇక్కడ విక్రయించేవాడు. అలా విక్రయిస్తుండగా హెచ్‌న్యూ పోలీసులు బొల్లారం పరిధిలో హర్షను అరెస్టు చేశారు. రూ.3.10 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: రష్యా మహిళను బహిష్కరించొద్దు : కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

Advertisment
తాజా కథనాలు