/rtv/media/media_files/2025/02/22/AB877DP0tOOB60FYoZlT.jpg)
SLBC టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది మృతి చెందారు. ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది. డెడ్ బాడీలను మార్క్ చేసింది రెస్క్యూ టీమ్. 3 మీటర్ల మట్టిలోపల మృతదేహాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. మృతుల్లో ఆరుగురు కార్మికులు. ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. ఆక్వా ఐతో పాటు GPR సిస్టమ్ తో ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది. మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను టన్నెల్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరో ముగ్గురి మృతదేహాలను కనుగొనేందుకు టీమ్ గాలిస్తోంది. మృతదేహాలను గుర్తించడంలో ఐఐటీ మద్రాస్ కు చెందిన నిపుణుల బృందం కీ రోల్ పోషించింది. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ఆధారంగా మృతదేహాలను గుర్తించారు. ప్రాణాలతో వస్తారనుకున్న వారి మృతదేహాలు బయటపడడంతో టన్నెల్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read : ప్రతి నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్క్.. మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన
Also Read : ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్.. ఆసీస్ కు షాకిస్తుందా?
BIG BREAKING NEWS
— RTV (@RTVnewsnetwork) February 28, 2025
SLBC టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి
8 మృతదేహాలను మార్కింగ్ చేసిన రెస్క్యూ టీం
ప్రాణాలతో వస్తారనుకున్న వారి మృతదేహాలు బయటపడడంతో టన్నెల్ వద్ద విషాద ఛాయలు.. pic.twitter.com/qKNqif7ILk
Follow Us