Food Poison In Narayanapet District Schools
ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. నారాయణపేట్ జిల్లా మగనూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది అస్వస్థకు గురవ్వడం కలకలం రేపింది. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకొని అస్వస్థకు గురయ్యారు.
Also Read: మహాయుతి కూటమిదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ సంచలన లెక్కలివే!
దీంతో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు.. విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీళ్లలో కొందరికీ ప్రాథమిక చికిత్స అందించి వాళ్లకు ఇళ్లకు పంపించారు. మరో 9 మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వీళ్లలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మరికొందరికీ పాఠశాల వద్దే చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు.. పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Also Read : రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ఏకంగా టీచర్‌ను కత్తితో పొడిచి..
మరోవైపు ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. '' ఇవి గురుకులాలా లేక నరక కుపాలా అంటూ ధ్వజమెత్తారు. పాఠశాలల లేక ప్రాణాలు తీసే విషయ వలయాలా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాంకిడి గిరిజన గురుకులంలో కూడా ఓ విద్యార్థిని ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్య పాలై 20 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతంటూ పేర్కొన్నారు. అలాగే బుధవారం నల్లగొండ జిల్లాలో ఓ విద్యార్థి పాము కాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని చెప్పారు. ఇప్పుడు నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు నేర్చుకోవడం కాదు, ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితికి తీసుకొచ్చిందని విమర్శించారు.
Also Read: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. డేట్‌కి వెళ్తే డబ్బులిస్తామంటూ..
Also Read: రేవంత్ పతనం కొడంగల్ నుంచే స్టార్ట్ చేస్తా: పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో!