Maha Yuti: మహారాష్ట్రలో గెలిచేది మహాయుతి కూటమే.. సంచలన ఎగ్జిట్ పోల్స్! హోరాహోరీగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిదే అధికారమని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పింది. బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) కూటమికి 175-195 సీట్లు వస్తాయని వెల్లడించింది. By Nikhil 20 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి హోరాహోరీగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిదే అధికారమని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పింది. ఆ వివరాల ప్రకారం.. బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) కూటమికి 175-195 సీట్లు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) ఉన్న మహా వికాస్ అఘాడీ కూటమి 85-112 సీట్లకే పరిమితం అవుతుందని పీపుల్స్ పల్స్ తేల్చి చెప్పింది. ఇది కూడా చూడండి: 9 ఏళ్లకే గర్భం దాల్చిన బాలిక.. షాకింగ్ వీడియో వైరల్! Peoples Pulse Exit Poll 2024: The ruling Mahayuti is poised for victory in Maharashtra! 🏛️ *Majority Mark: 145/288 🔹 Mahayuti: 182 (175-195) 🔹 MVA:* 97 (85-112) 🔹 Others: 9 (7-12) #MaharashtraElections2024 #ExitPollResults #MahayutiVictory #BJPMaharashtra #MVA pic.twitter.com/RFDEanXz4x — Peoples Pulse (@PulsePeoples) November 20, 2024 ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్! పార్టీల వారీగా వచ్చే సీట్లు ఇవే.. పార్టీల ప్రకారం వచ్చే సీట్లను పరిశీలిస్తే బీజేపీ 102-120 సీట్లతో టాప్ ప్లేస్ లో నిలవనుంది. ఆ పార్టీ తర్వాత ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 42-61 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనా వేసింది. ఇంకా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 14-25 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే తెలిపింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ 24-44 సీట్లకే పరిమితం అఅయ్యే అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇంకా శివసేన (UBT)కి 21-36, ఎన్సీపీ (శరద్ పవార్) 28-41 సీట్లు ఇతరులకు 6-12 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు! Also Read: మహాయుతి కూటమిదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ సంచలన లెక్కలివే! #exit-polls #maha-yuti #maharashtra election 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి