Keesara: మానవత్వం మంటగలిసింది.. కాపాడండి బాబూ అంటున్నా కనికరించలేదు!

హైదరాబాద్‌లోని కీసరలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఏలేందర్ (35)ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏలేందర్ రెండుకాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. ఆసుపత్రికి తరలించండి అంటూ బాధితుడు ప్రాధేయపడినా చుట్టూ ఉండేవారు చూస్తూ ఉండిపోవడంతో ప్రాణాలు విడిచాడు.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

ఇదొక విషాదకర ఘటన. మనస్సు తొలిచే పరిణామం. కళ్లముందు ప్రాణం పోతున్నా.. చూస్తూ వీడియోలు తీసిన వైనం. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి తనను కాపాడండి బాబూ అంటూ చుట్టూ ఉన్న వారిని వేడుకున్నాడు. కానీ ఒక్కరి మనసు కరగలేదు. అంబులెన్స్ వచ్చే వరకు.. వీడియోలు, ఫొటోలు తీస్తూ గడిపేశారు. ఇక కాసేపటికి అంబులెన్స్ వచ్చి అతడిని సమీపంలో ఉన్న హాస్పిటల్‌కి తరలించింది. కానీ ఆయన ప్రాణం అప్పటికే పోయింది. ఈ విషాదకర ఘటన కీసర అవుటర్ రింగు రోడ్డు వద్ద జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: చెల్లి ఫొటోతో ఎఫ్‌బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్

రెండు కాళ్లు నుజ్జు నుజ్జు

వరంగల్‌కు చెందిన వి.ఏలేందర్ (35) కీసర సమీపంలోని రాంపల్లి చౌరస్తాలో ఉంటున్నాడు. అతడు కీసరలో ఓ ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇందులో భాగంగానే తరచూ అక్కడికి వెళ్లి చూస్తూ వచ్చేవాడు. ప్రతి రోజు మాదిరిగానే బుధవారం సాయంత్రం తన స్కూటీపై నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు వెళ్తుండా.. వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన ఒక లారీ ఏలేందర్ స్కూటీని ఢీకొట్టింది. 

Also Read: ఇవి తింటే బరువు తగ్గడం కన్ఫామ్‌

దీంతో అతడు అక్కడికక్కడే పడిపోయాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన కొందరు స్థానికులు అరుపులు అరిశారు. వెంటనే డ్రైవర్ లారీని రివర్స్ చేయడంతో.. లారీ చక్రాలు ఏలేందర్ కాళ్లపైకి ఎక్కాయి. ఈ ప్రమాదంలో ఏలేందరి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో ఏలేందరి విలవిల్లాడాడు. అదే సమయంలో తనను వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లమని చుట్టూ ఉన్న స్థానికులను వేడుకున్నాడు. 

Also Read :  చిట్టి రోబో బడా దొంగతనం.. 12 రోబోట్‌లను కిడ్నాప్‌ చేసి..!

కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. వీడియోలు, ఫొటోలు తీస్తూ ఉండిపోయారు. ఈ లోపు 108 వాహనం వచ్చింది. దీంతో వెంటనే ఏలేందర్‌ను సమీపంలోని ఈసీఐఎల్ చౌరస్తాలోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఏలేందర్ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి కారణం అయిన లారీ డ్రైవర్ లక్ష్మణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఏలేందర్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ విషాదకర ఘటన అందరినీ తొలిచివేస్తోంది. 

Also Read :  ఎర్త్ మ్యాగ్నెట్ వేగంతో మార్పులు..ప్రళయం తప్పదా?

Advertisment
Advertisment
తాజా కథనాలు