Earth: ఎర్త్ మ్యాగ్నెట్ వేగంతో మార్పులు..ప్రళయం తప్పదా? భూమి అయస్కాంత క్షేత్రం వేగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనివలన ఉత్తర, దక్షిణ ధ్రువాలు కదులుతున్నాయి. భూమి ఉత్తర ధ్రువ అయస్కాంత క్షేత్రం వేగంగా రష్యా వైపు కదులుతున్నట్లుగా బ్రిటన్ శాసత్రవేత్తలు చెప్పారు. By Manogna alamuru 21 Nov 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Earth Magnetic waves: భూమికి ఆయస్కాంతశక్తి ఉంది ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇది భూమి చుట్టూ నిర్ణీత వేగంతో ఉంటుంది. కానీ ఇపుడు ఆ వేగం మార్పులకు గురౌతోంది అని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివలన భూమి ఉత్తర ధ్రువ అయస్కాంత క్షేత్రం వేగంగా రష్యా వైపు కదులుతున్నట్లుగా చెప్పారు. లైవ్ సైన్స్ ప్రకారం.. శాస్త్రవేత్తలు దశాబ్ధాలుగా ఉత్తర ధ్రువాన్ని ట్రాక్ చేస్తున్నారు. ఇది కెనడా నుంచి సైబీరియా వైపు 2250 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ దాని కదలిక ఇటీవల కాలంలో వేగవంతమైంది. 1990-2005 మధ్య కదలిక రేటు ఏడాదికి 15 కి.మీ నుంచి 50-60 కి.మీకి పెరిగింది. భూమి మఈద మనం ఇలా బతకగులుగుతున్నాము అంటే దానికి కారణం అయస్కాంత శక్తి. అంతేకాదు అయస్కాంత క్షేత్రాలతో మన నిత్య జీవితంలో చాలా సనులతో ముడిపడి కూడా ఉన్నాయి. నావిగేషన్ వ్యవస్థకు ఉపయోగపడటంతో పాటు భూమి, భూ వాతావరణాన్ని, జీవజాలాన్ని ప్రమాదకర రేడియేషన్ నుంచి రక్షిస్తోంది. మనం ఉపయోగించ జీపీఎస్ వ్యవస్థకు ఉత్తర అయస్కాంత ధ్రువం ముఖ్యమైంది. వీటి కోసమే దీని వేగాన్ని శాస్త్రవేత్తలు నిరంతరం గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వేగం పెరిగింది. దీనివలన దరిదాపుల్లో ప్రమాదం లేకపోయినా...భవిష్యత్తులో ప్రళయం తప్పనే అంటున్నారు. ఇదే వేగం కొనసాగితే..రాబోయే దశాబ్ధంలో భూమి అయస్కాంత ఉత్తర ధ్రువం 660 కిలోమీటర్లు కదులుతుంది. మరోవైపు దక్షిణ ధ్రువం కూడా కదులుతోంది. అంటార్కిటా మీదుగా తూర్పు వైపుకు జారిపోతోంది. ప్రతి 300,000 సంవత్సరాలకు స్విచ్ జరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చివరి సారిగా ఇలా ధ్రువాలు మారడం 7,80,000 ఏళ్ల క్రితం జరిగింది. కాబట్టి చాలా కాలం అవుతుందని చెబుతున్నారు. Also Read: Zomato: నో శాలరీ..నో రెజ్యూమె..జోమాటో సీఈవో కొత్త ఆఫర్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి