తల్లిదండ్రులకు తమ పిల్లలంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే తమ పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటారు. ఏది కావాలంటే అది కొనిస్తారు. వారికి మంచి జీవితం ఇద్దామని ఎన్నో కష్టాలు పడతారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంచుతారు. ఒకవేళ చెడు అలవాట్లకు పాల్పడితే వారిని సున్నితంగా మందలిస్తారు. అప్పటికి వినకపోతే ఇంకొంచెం గట్టిగా తిడతారు.
ఇది కూడా చదవండి: నకిలీ RTO ఘరానా మోసం.. ఈ ట్విస్టు ఊహించడం కష్టమే భయ్యా!
సిగరెట్‌కు బానిసైన 16 ఏళ్ల విద్యార్థి
అది ఎంతో అవమానంగా భావించి కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఇప్పటికి చాలానే చూసాం. అలాంటిదే తాజాగా హైదరాబాద్‌లో మరొకటి జరిగింది. సిగరెట్‌కు బానిసైన 16 ఏళ్ల విద్యార్థిని తన తండ్రి మందలించ్చాడు. వద్దు బాబూ సిగరెట్ తాగకురా.. ఆరోగ్యం చెడిపోతుందని చెప్పాడు. అప్పటికీ వినకపోవడంతో ఇంకొంచెం గట్టిగా మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ విద్యార్థి తాజాగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సిరిసిల్ల జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: తెలంగాణలో 13 నర్సింగ్ కాలేజీలకు అనుమతి
తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన అలువాల వెంకటేష్ (16) సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఆ బాలుడు సిగరెట్‌కు బానిసయ్యాడు. దీంతో ఆ విషయం తెలిసి వెంకటేష్‌ను అతడి తండ్రి తరచూ మందలించేవాడు. సిగరెట్ తాగొద్దు బాబు ఆరోగ్యం చెడిపోతుందని చెప్పాడు. అప్పటికీ వినలేదు.
ఇది కూడా చదవండి: అంధులకు దారి చూపించే AI కళ్లద్దాలు.. చదివిస్తాయి కూడా
6 నెలల క్రితం గడ్డి మందు తాగి
6 నెలల క్రితం కోపంగా మందలించడంతో వెంకటేష్ గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స అందించడంతో వెంకటేష్ కోలుకున్నాడు. అయితే వెంకటేష్ ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఫ్రెండ్స్, కుటుంబంతో మాట్లాడకుండా ఉండేవాడు. ఇందులో భాగంగానే నిన్న (శుక్రవారం) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
Also Read : బుమ్రా దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు గజగజ.. 104 ఆలౌట్!