/rtv/media/media_files/2025/01/27/nXfqNbbF7NYLhXascDl4.webp)
TGRTC FREE BUS
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి సూపర్ న్యూస్ అందించింది. అది కూడా హైదరాబాద్, విజయవాడ మధ్య ట్రావెల్ చేసేవారికి. ఈ మార్గంలో తిరిగే బస్సుల టికెట్ల రేట్ల మీద రాయితీలను ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీలోని లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని ప్రకటించింది. దాంతో పాటూ రాజధాని ఏసీ సర్వీసుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు చెప్పింది. హైదరాబాద్, విజయవాడల మధ్య ప్రయాణించేవారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పింది. ఎవరైనా ముందే టికెట్లను రిజర్వ్ చేసుకోవాలనుకుంటే https://www.tgsrtcbus.in వెబ్ సైట్ లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
హైదరాబాద్-బెంగళూరుకు కూడా..
రెండు రోజుల క్రితం బెంగళూరు- హైదరాబాద్ మార్గంలో ప్రయాణించేవారికి కూడా ఇలాగే రాయితీలను ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ. బెంగళూరు మార్గంలో నడిచే అన్ని సర్వీసుల్లోనూ ఈ రాయితీని అమలు చేస్తు్న్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. దీనివల్ల ఒక్కొక్క టికెట్‌పై ప్రయాణీకుడు రూ.100 నుంచి రూ.160 వరకు ఆదా చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు. ఈ రూట్లలో బస్సు సర్వీసులను పెంచడంలో భాగంగానే ఈ రాయితీని తీసకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రూట్‌లో ప్రైవేటు ట్రావెల్ బస్సులు అధికంగా ప్రయాణిస్తుంటారు. వాటినుంచి ప్రయాణీకులను ఆర్టీసీకి మళ్లించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టికెట్లు ముందస్తు రిజర్వేషన్ కోసం https: //tgsrtcbus.in వెబ్ సైట్‌ని లాగిన్ అవ్వాలని కోరారు.
Also Read: BIG BREAKING: జగన్, కొడాలి నానితో పాటూ..8 మంది వైసీపీ నేతలపై కేసు