/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rains.jpg)
Rain Alert To Telangana: రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటలు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మే 15వరకు ఇదే వాతావరణం ఉంటుందని పేర్కొంది. రాబోయే 24 గంటలకు ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
Also Read: 15 సెకన్లు కాదు గంట టైమ్ తీసుకోండి.. నవనీత్ కౌర్ కు అసదుద్దీన్ స్ట్రాంగ్ రిప్లై!
యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. అలాగే మరో 10 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో గురువారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. మిగతా జిల్లాల్లో 40 డిగ్లీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఎండల తీవ్రత నుంచి కాస్త ఊరట పొందుతున్నారు.
Also Read: రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది… రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు