Telangana:అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ - కిషన్ రెడ్డి ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మాట్లాడిన ఆయన దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి పన్ను ఆదా ప్రకటించిందని తెలిపారు. By Manogna alamuru 24 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kishan Reddy: వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్'లో భాగంగా పేదలను శక్తివంతం చేయడం, అన్నదాత ఉత్పాదక సామర్థ్యాలను పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. కోటిమంది పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాలను తీర్చడానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడిని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించిందని తెలిపారు. 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే కేంద్రం లక్ష్యం పెట్టుకుందని వివరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్‌గా అభివర్ణించారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దేశ యువతకు పెద్దపీట వేసిందని కొనియాడారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందో రేవంత్ రెడ్డినే అడగాలన్నారు. రేవంత్ రెడ్డి అతని గురువు చంద్రబాబును చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. మోదీతో ఎలాంటి అర్జీలు, విన్నపాలు చేసుకున్నారో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నడపలేని స్థితిలో ఉందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆక్షేపించిన ఆయన అసెంబ్లీని నాలుగు రోజులు నడపడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. బీఏసీ సమావేశంలో 18రోజులు సభ నడపాలని కోరడంతో పాటు 18అంశాలు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని విమర్శించారు. Also Read:Andhra Pradesh: రేపు సమావేశమవనున్న ఏపీ కేబినెట్ #telangana #budget-2024 #minister #kishan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి