AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎల్లుండి ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో పాటూ 3నెలల కోసం అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. నిన్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఆంధ్రాకు బోలెడు వరాలు కురిపించారు. దీనిపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అమరావతికి (Amaravati) మళ్లీ మంచిరోజులు వచ్చాయనే ఆశ అందరిలో చిగురించిందన్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం జరిగుంటే మరో మూడు లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపద కూడా వచ్చి ఉండేదని చెప్పారు. గత పాలకుల వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక ఏపీ జీవనాడి పోలవరం 72శాతం పూర్తయింది. పోలవరాన్ని సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేస్తామని బడ్జెట్లో (Union Budget 2024) ఆర్థిక మంత్రి నిర్ధిష్టమైన హామీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. 2020-21 నాటికి పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని, కావాలని కాంట్రాక్టర్లను, అధికారులను మారుస్తూ అంతా పాడు చేశారంటూ మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: రేపు సమావేశమవనున్న ఏపీ కేబినెట్
గురువారం మధ్యాహ్నం 2.30 నిముషాలకు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో 3నెలల కోసం అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దాంతోపాటూ మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: