TG Job Calendar: జూన్‌లో నోటిఫికేషన్లు, డిసెంబర్‌లోగా నియామకాలు.. తెలంగాణ జాబ్ క్యాలెండర్ లేటెస్ట్ అప్డేట్స్!

అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. మార్చిలోగా ఖాళీల వివరాలు సేకరించి, జూన్‌ 2లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. డిసెంబరు 9లోగా నియామకాలు పూర్తి చేసేలా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్నట్లు సమాచారం.

TG Job Calendar: జూన్‌లో నోటిఫికేషన్లు, డిసెంబర్‌లోగా నియామకాలు.. తెలంగాణ జాబ్ క్యాలెండర్ లేటెస్ట్ అప్డేట్స్!
New Update

CM Revanth: తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. ఈ మేరకు ప్రతి సంవత్సరం మార్చిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే జూన్‌ 2లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసి డిసెంబరు 9లోగా నియామకాలు పూర్తి చేస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే తన ప్రభుత్వం లక్ష్యమని, గత పదేళ్లలో నిరుద్యోగులకు చాలా నష్టం జరిగిందన్నారు. నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రూప్‌-2 వాయిదా వేశామని చెప్పారు.

ఇది కూడా చదవండి: Sushanth: సుశాంత్‌ను చేతబడి చేసి చంపిన రియా.. అలాగే డబ్బులు సంపాదిస్తూ!

మేనిఫెస్టోలో 2లక్షల ఉద్యోగాలు..
ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, స్పెషల్ డిపార్టుమెంట్ నియామకాల మిషన్ ద్వారా చేపడతాని హామీ ఇచ్చింది. అంతేకాదు దరఖాస్తుదారులకు అభ్యర్థులు ఒక రూపాయి ఫీజు కట్టాల్సిన అవసరం లేదని మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే 2024 ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్, ఏప్రిల్ 1న గ్రూప్-2 నోటిఫికేషన్, డిసెంబరు 15న రెండో ఫేజ్ నోటిఫికేషన్, జూన్ 1, డిసెంబరు 1 - రెండుసార్లు గ్రూప్-3, 4 నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు చేపడతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది.

ఆగని నిరుద్యోగుల ఆందోళనలు..
అయితే చెప్పినట్లుగా గ్రూప్-1 ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ నోటిఫికేషన్ ప్రకారం 1:50 నిష్పత్తి అంటే ఒక పోస్ట్‌కు 50 మంది లెక్కన మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేశారు. కానీ గ్రూప్-1 అభ్యర్థులు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు డీఎస్సీ ఎగ్జామ్స్ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసినప్పటికీ పోస్టుల పెంపుపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఇక గతేడాది మల్కాజిగిరీ ఎంపీగా ఉన్నప్పుడు.. గ్రూప్-2 విషయంలో నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని రేవంత్ హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రజా ప్రభుత్వం రాబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచి మళ్లీ నోటిఫికేషన్ ఇస్తాం. యువతకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాత నోటిఫికేషన్ ప్రకారమే 783 పోస్టులతో పరీక్షలు నిర్వహిస్తుండటంతో నిరుద్యోగుల ఆందోళనకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రధానమైన 3 డిమాండ్లు..
నిరుద్యోగుల ప్రధానమైన 3 డిమాండ్లు ఇలా ఉన్నాయి. 1. గ్రూప్-1 మెయిన్స్‌కు పోస్టులు, అభ్యర్థుల నిష్పత్తిని 1:50 నుంచి 1:100కు పెంచాలి. 2. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌లో గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచాలి. 3. మరిన్ని పోస్టులతో డీఎస్సీ నోఫికేషన్ విడుదల చేయాలి.

ఇది కూడా చదవండి: Mechanic Rocky: విశ్వక్‌ సరసన కోలీవుడ్ బ్యూటీ.. ‘మెకానిక్‌ రాకీ’ అప్డేట్ ..!



#telangana #job-calendar #cm-revanth
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి