/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-33-6.jpg)
Riya: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ మిస్టరీ ఇంకా వీడనేలేదు. ఆయన మరణానికి ప్రియురాలు రియా చక్రవర్తి కారణమంటూ కొంతకాలంగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో సంచలన విషయం బయటకొచ్చింది. రియా చేతబడి చేసి సుశాంత్ ను చంపేసిందని, అందుకే సుశాంత్ సూసైడ్ చేసుకుని చనిపోయాడని వాదిస్తున్నారు.
Me when I see my friends #postquarantine 👻 #rheality pic.twitter.com/84KIvQ8AEx
— Rhea Chakraborty (@Tweet2Rhea) June 13, 2020
అలాగే డబ్బులు సంపాదిస్తున్నా..
అయితే ఈ విషయం మరింత ప్రచారంలోకి వెళ్లగా ఒక్కసారిగా ఉలిక్కిపడిన రియా.. మరోసారి సుశాంత్ డెత్ పై క్లారిటీ ఇచ్చింది. 'కొంతకాలంగా సినిమాల్లో నటించకపోవడంతో చాలామంది నన్ను ఏం చేస్తున్నావ్? అని అడుగుతున్నారు. కానీ నేను ప్రస్తుతం మోటివేషనల్ స్పీకర్‌గా పనిచేస్తున్నా. అలాగే డబ్బులు సంపాదిస్తున్నా. ఇది నా జీవితంలో ఛాప్టర్ 2. నా లైఫ్‌లో ఏం జరిగిందో, నేను ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవించిన బాధ నాకు మాత్రమే తెలుసు. ఎన్నో ఊహగానాలొచ్చాయి. అవన్నీ నిజమో కాదో నాకు మాత్రమే తెలుసు. చేతబడి చేసి సుశాంత్ ను చంపేశానన్నారు. కానీ ఎవరెన్ని అనుకున్నా నేను నిజాయితీగా ఉన్నాను. ధైర్యంగా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నా' అని చెప్పింది. ఇక సుశాంత్ 2020 జూన్ 14న ముంబైలోని తన ఇంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు.
View this post on Instagram