Ex-HMDA Director Shiva Balakrishna: ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలతో గత బుధవారం ఏసీబీ అధికారులు HMDA మాజీ డైరెక్టర్, రియల్ ఎస్టేట్ రెగ్యురేటరీ అథారిటీ సెక్రటరీ బాలకృష్ణ ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఏకకాలంలోనే 17 చోట్ల సోదాలు జరిపిన ఏసీబీ (ACB) అధికారులు రూ. కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: 317 జీవోను సవరిస్తారా? లేదా?
పోలీసు కస్డడీ తీసుకోవాలి
బినామీ పేర్లతో ఆస్తులు సంపాదించినందున.. ఆ వివరాలను బయటకి రాబట్టడానికి పోలీసు కస్టడీ తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది. బాలకృష్ణ అక్రమాస్తులకు సంబంధించి కోర్డుకు కూడా రిమాండ్ రిపోర్ట్‌ను సమర్పించింది. బినామీలతో పాటుగా బాలకృష్ణ అవినీతికి ఎవరెవరు సహకరించారో ఆ అధికారుల పాత్రపై కూడా అనుమానాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. వాళ్లకి కూడా త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. బాలకృష్ణకు సంబంధించిన ఆస్తులు, అక్రమంగా సంపాదించడానికి పాటించిన విధానాలను మొత్తం 45 పేజీల రిమాండ్ రిపోర్టులో (Remand Report) ఏసీబీ ప్రస్తావించింది.
వేటుకు సిద్ధం
అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బలకృష్ణపై చర్యలు తీసుకుందుకు రంగంలోకి దిగింది. సర్వీసు నుంచి అతడ్ని తొలగించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బాలకృష్ణపై వేటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలకృష్ణ హామీతో ఫైల్స్‌పై సంతకాలు చేసిన ఉద్యోగులకు నోటీసులు పంపించినట్లు సమాచారం.
Also Read: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల!