Investigation Medigadda project: తెలంగాణ హైకోర్టు సీజేకి (High Court CJ) రాష్ట్ర ప్రభుత్వం (Congress Government) లేఖ రాసింది. మేడిగడ్డపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్డిని కేటాయించాలని రేవంత్ సర్కార్ లేఖలో కోరింది. మేడిగడ్డపై (Medigadda Project) విజిలెన్స్ విచారణలో రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్, సీఏ పేర్లు ఉన్నట్లు తెలిపింది. జ్యుడిషియల్ విచారణ, విజిలెన్స్ విచారణలో ప్రాజెక్టు నిర్మాణంలో కీలక వ్యక్తి ఎవరు..? ఏం చేశారు..? కాంట్రాక్టు ఎలా ఫైనల్ అయ్యింది..? అనే అంశాలపై విచారణ చేయాలని విజిలెన్స్, జ్యుడిషియల్ ఎంక్వైరీలో తెలంగాణ ప్రభుత్వం చేర్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో విజిలెన్స్ అధికారుల సోదాలు
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఈ చర్యలు చేపట్టింది. జలసౌధలోని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్ళారు. ఈఎన్సీ మురళీధర రావు ఆఫీస్‌లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆఫీసులోని రెండు, నాలుగు అంతస్థుల్లో తనిఖీలు చేశారు.
Also read:సైఫ్ మీద వచ్చిన ఆరోపణలు నిజమే.. ర్యాగింగ్ నిరోధక కమిటీ
హైదరాబాద్‌తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో పది ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. 12 బృందాలతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. మహాదేవపూర్‌లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు, విలువైన పత్రాలను అధికారుల బృందం పరిశీలిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్‌హౌజ్‌లకు సంబంధించిన కార్యాలయాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగ్ రిపోర్టులో అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. వాటికి సంబంధించి ఆఫీసుల్లో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
అసలేమైంది..
తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ వంతెన కుంగిపోవడం దుమారం లేపింది. బ్యారేజీలోని బీ బ్లాక్ పరిధిలో గల 18,19, 20, 21 పిల్లర్ల వద్ద బ్ఈయారేజీ వంతెన కుంగింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగడంపై అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కోట్లు ఖర్చుపెట్టామని చెప్పి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించారని ఆరోపించారు. అప్పట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. అప్పటి బీఆర్‌ఎస్ సర్కార్‌పై విమర్శలు చేశారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మేడిగడ్డకు సంబంధించి పూర్తి వివరాలను నీటిపారుదల శాఖ అధికారులు అందజేశారు. ఇటీవలే మంత్రులు కూడా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు.