TS Government Jobs: బీటెక్ అభ్యర్థులకు 5089 ఉద్యోగాలకు అర్హత.. తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త..!! తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ చదివిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కేసీఆర్ సర్కార్. రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ అభ్యర్థులతోపాటుగా బీటెక్ తో బీఈడీ చేసిన అభ్యర్థులందరూ టీచర్లు కావచ్చంటూ వెల్లడించింది. బీటెక్, బీఈతో బీఈడీ చేసిన అభ్యర్థులకు డీఎస్సీ 2023లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజికల్స్ సైన్స్ పోస్టులకు వీరు పోటీ పడొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులను జారీ చేశారు. By Bhoomi 12 Oct 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ చదివిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కేసీఆర్ సర్కార్. రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ అభ్యర్థులతోపాటుగా బీటెక్ తో బీఈడీ చేసిన అభ్యర్థులందరూ టీచర్లు కావచ్చంటూ వెల్లడించింది. బీటెక్, బీఈతో బీఈడీ చేసిన అభ్యర్థులకు డీఎస్సీ 2023లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజికల్స్ సైన్స్ పోస్టులకు వీరు పోటీ పడొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా బీఈ చదివిని విద్యార్థులకు 2015-17నుంచి బీఈడీకి ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత 2017 లో తొలిసారిగా తెలంగాణ టెట్ లో కూడా వారికి ఛాన్స్ ఇచచారు. ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు శుభవార్త…ఎయిమ్స్‌లో భారీ రిక్రూట్మెంట్..పూర్తి వివరాలివే..!! అయితే టీఆర్టీ 2017కు బీటెక్, బీఈ అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. దీనిపై అప్పట్లో కొందరు అభ్యర్థులు కోర్టును కూడా ఆశ్రయించారు. అయితా లేటెస్టుగా 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ 2023 నోటిఫికేషన్ ఇచ్చింది. పోయిన నెల 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ అనేది షురూ అయ్యింది. ఈ క్రమంలో టెట్ కు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో డీఎస్సీకి ఛాన్స్ ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి విజ్నప్తి చేశారు. ఈ విజ్నప్తికి సర్కార్ పచ్చ జెండా ఊపింది. దీంతో ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియతోనూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం నుంచి ఇంజనీరింగ్ అభ్యర్థులు అప్లై చేసుకునే ఛాన్స్ కల్పించనున్నారు. అయితే ఇప్పటికే 17వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తొలిసారిగా బీటెక్ అభ్యర్థులకు అవకాశం కల్పించడంతో...ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్లు వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పసిడి ప్రియులకు ఊరటనిచ్చే వార్త…తగ్గిన బంగారం, వెండి ధర..!! #telangana #jobs #dsc #ts-government-jobs #btech #trt మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి