TRT 2023: తెలంగాణ టీఆర్టీ అభ్యర్థులకు కొత్త టెన్షన్.. ఆ సమస్య పరిష్కారం ఎలా?
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా పోస్టుల సంఖ్యను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. టీఆర్టీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్టీ విషయంలో స్థానికత అంశంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ కోరుతున్నారు. ధ్రువీకరణ కష్టంగా మారుతుందంటున్నారు అభ్యర్ధులు. స్థానికతకు సంబంధించిన నిబంధన మార్పుతో చాలా సమస్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్ుతన్నారు. ఎప్పుడో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన పాఠశాలలు ఇప్పుడు మూతపడటంతో అవస్థలు పడుతున్నారు. కొన్నింటికి పర్మిషన్ లేకపోవడంతో డీఈవో కార్యాలయాల్లోనూ డేటా లభించడంలేదు. పలు జిల్లాల్లో ఎస్ఏ పోస్టులు కూడా లేవు. నాన్ లోక్ పోస్టులకూ అవకాశమే లేదు.