TS Government Jobs: బీటెక్ అభ్యర్థులకు 5089 ఉద్యోగాలకు అర్హత.. తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త..!!
తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ చదివిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కేసీఆర్ సర్కార్. రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ అభ్యర్థులతోపాటుగా బీటెక్ తో బీఈడీ చేసిన అభ్యర్థులందరూ టీచర్లు కావచ్చంటూ వెల్లడించింది. బీటెక్, బీఈతో బీఈడీ చేసిన అభ్యర్థులకు డీఎస్సీ 2023లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజికల్స్ సైన్స్ పోస్టులకు వీరు పోటీ పడొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులను జారీ చేశారు.