Cabinet Meeting : నెల రోజుల పాలన... రెండు గ్యారెంటీల అమలు...ఇదీ తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ప్రోగ్రెస్. దీని మీద తాము సంతృప్తిగా ఉన్నామని చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). దీనిపై రేవంత్ రెడ్డి స్వయంగా ట్వీట్(Tweet) కూడా చేశారు. తాము సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాటను నిలబెట్టుకుంటున్నామని...నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినచ్చిందని అన్నారు. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపుకు అడుగులు వేస్తున్నాం అంటూ రాసుకొచ్చారు.
Also read:తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..ఇవాళ్టి నుంచి అకౌంట్లలోకి రైతుబంధు
ఇక కాంగ్రెస్ పాలనలోకి వచ్చిన ఈ నెలరోజుల్లో మహాలక్ష్మీ ఉచిత బస్సు పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ(Rajiv Arogyasri) లబ్ది పెంపు అనే రెండు పథకాల్ని ఆల్రెడీ అమలు చేసింది. అలాగే రైతు భరోసా బదులుగా పాత రైతు బంధు(Rythu Bandhu) పథకం కింద కొంత మంది రైతులకు మనీ ఇచ్చింది.దీంతో ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలలో 2 అమలుచేసినట్లైంది. ఈ వారంలో మరో రెండు గ్యారెంటీల అమలు చేయాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని మీద ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష ఉండనుంది. తెలంగాణ కేబినెట్ భేటీలో కూడా కూడా ఈ విషయం చర్చకు రానుంది.
500రూ.కే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్... ఈ రెండు హామీలనూ వారం లేదా 10 రోజుల్లో కచ్చితంగా అమలు చెయ్యాలని ప్రభుత్వం ఫిక్స్ అయినట్లు తెలిసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఈ రెండు పథకాలూ వర్తించేలా చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈరోజు నుంచి యాసంగి రైతుబంధు అకౌంట్లలోకి జమ అవుతుందని ప్రకటించింది. రాష్ట్రంలో రబీపంటల సాగు ముమ్మరంగా సాగుతున్నందున రైతులకు అవసరమైన పెట్టుబడి కోసం రైతుబంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 40శాతం మంది రైతులకు నిధులు అందాయని… 27లక్షల మంది రైతుల ఖాతాలకు నిధులు జమ అయ్యాయని తెలిపారు.