ఆర్టీసీ విలీనం బిల్లుకు తెలంగాణ గవర్నర్ ఆమోదం టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆమోదం తెలిపారు. ఈ బిల్లుతో 43,055 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్నారు. By Manogna alamuru 14 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి టీఎస్ ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వంలో విలీనం అయిపోయింది. దీనికి సంబంధించిన బిల్లు కు గవర్నర్ తమిళ సై ఆమోదం తెలిపారు. ఆమె చేసిన 10 సిఫారుసుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో గవర్నర్ బిల్లు మీద సంతకం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ అభినందనలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం శాసన సభలో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదించడం వలన 43,055 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం కార్పొరేషన్ రూల్స్ ప్రకారమే కొనసాగుతారు. ప్రస్తుతం బిల్లుతో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీనే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. పదవి విరమణ ప్రయోజనాలను ఆర్టీసీ ఉద్యోగులతో చర్చించి నిర్ణయిస్తామని గవర్నర్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై ప్రతి ఏడాది రూ.3000 కోట్లు అదనపు బారం పడనుంది. ప్రజా రవానను పటిష్టం చేసేందుకు, సేవలను ఇంకా విస్తృతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులు గతంలో చేసిన సమ్మెను పరిగణలోకి తీసుకుని ఇప్పుడు సానుకూల నిర్ణయాన్ని వెలువరించింది. #approve #tamil-sai #telangana #rtc #bill #merge #assembly #governer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి