Telangana Elections: కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తుమ్మల పెట్టిన కండీషన్స్ ఇవే.. మరి కాంగ్రెస్ ఒప్పుకునేనా..?

ఖమ్మంలో రాజకీయం మరింత రంజుగా మారుతోంది. జంపింగ్ జపాంగ్‌లతో స్టే్ట్ లుక్ అంతా ఖమ్మంపై పడింది. ఒకప్పుడు బీఆర్‌ఎస్‌లో కీలకంగా ఉన్న నేతలు.. పార్టీ అధినేత ముఖం చాటేయడంతో ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన వర్గం అంతా కాంగ్రెస్‌లో పార్టీలో చేరగా.. ఇప్పుడు మరో నేత కూడా ఆయన మార్గంలోనే పయనించేందుకు సిద్ధమయ్యారు.

Telangana Elections: కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తుమ్మల పెట్టిన కండీషన్స్ ఇవే.. మరి కాంగ్రెస్ ఒప్పుకునేనా..?
New Update

Tummala Nageswara Rao: ఖమ్మంలో రాజకీయం మరింత రంజుగా మారుతోంది. జంపింగ్ జపాంగ్‌లతో స్టే్ట్ లుక్ అంతా ఖమ్మంపై పడింది. ఒకప్పుడు బీఆర్‌ఎస్‌లో కీలకంగా ఉన్న నేతలు.. పార్టీ అధినేత ముఖం చాటేయడంతో ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన వర్గం అంతా కాంగ్రెస్‌లో పార్టీలో చేరగా.. ఇప్పుడు మరో నేత కూడా ఆయన మార్గంలోనే పయనించేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మంలోనే కాకుండా.. రాష్ట్ర రాజకీయాల్లోనే సీనియర్ అయినా ఆ నేత ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయనెవరో కాదు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. తొలి జాబితానే 115 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. అందులో సీటు దక్కని వారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అలాంటి వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకరు. రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా ఖమ్మం పాలిటిక్స్‌లో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన తుమ్మల గత ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఈసారి ఆయన పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినా.. గులాబీ బాస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కందాల ఉపేందర్ రెడ్డికే టికెట్ కన్ఫామ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడాలని ఫిక్స్ అయ్యారు తుమ్మల. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనతో మంతనాలు జరిపారు. కాంగ్రెస్‌లో చేరాలంటూ కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన తుమ్మల.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, దానికంటే ముందు ఆయన కొన్ని కండీషన్స్ పెట్టారు. మరి తుమ్మల పెట్టిన కండీషన్స్ ఏంటి? కాంగ్రెస్ వాటికి అంగీకరిస్తుందా? ఇంట్రస్టింగ్ పొలికల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం..

తుమ్మల షరతులివే..

పాలేరే తనకు ప్రాణం అంటున్న తుమ్మల.. ఆ సీటు తనకే కేటాయించాలని మొదటి షరతు పెట్టారట. పాలేరు అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని, సీటును తనకే కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేశారట తుమ్మల. అలాగే, పాలేరు మినహా తెలంగాణలో మరో నాలుగు స్థానాలు తన అనుచరులకు కేటాయించాలని ప్రతిపాదించారట. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని మట్టా దయానంద్ లేదా రాగమయికి కేటాయించాలని ప్రతిపాదన చేశారు తుమ్మల. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు వ్యవహారంపై అధిష్టానంతో చర్చించారు తుమ్మల. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ హైకమాండ్ బదులిచ్చిందట. మరి తుమ్మల కండీషన్స్ యాక్సెప్ట్ చేస్తుందా? లేదా అని చూడాలి మరి.

తుమ్మల చేరిక ఎప్పుడు?

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన తుమ్మల నాగేశ్వరరావు.. ఇందుకోసం మంచి తేదీని చూస్తున్నారట. రెండు మూడు రోజుల్లో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని తుమ్మల అనుచరులు చెబుతున్నారు. ఇక అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఇప్పుడు తుమ్మల కూడా చేరుతుండటంతో ఖమ్మం కాంగ్రెస్‌లో డబుల్ జోష్ కనిపిస్తోంది. ఈసారి ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం అని పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ఎన్నికల కదనరంగంలోకి దూకుతున్నారు. మరి చూడాలి ఈసారి ఖమ్మం పొలిటికల్ పోరు ఎలా ఉంటుందో.

Also Read:

Amit Shah: ‘ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని అంతం చేయాలని చూస్తున్నారు’.. ఉదయనిధిపై అమిత్ షా ఫైర్..

#telangana-elections #khammam #telangana #tummala-nageshwar-rao #telangana-congress #congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి