MP Laxam: బీఅర్ఎస్ కాంగ్రెస్ ల మేనిఫెస్టోలు సంక్షోభం కోసమే.. లక్ష్మణ్ విమర్శలు!

బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలు సంక్షోభం కోసమేనని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఉచితం పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఉచితాలు పోటీ పడి వేలం పాటలాగా ప్రకటిస్తున్నారని అన్నారు.

New Update
MP Laxam: బీఅర్ఎస్ కాంగ్రెస్ ల మేనిఫెస్టోలు సంక్షోభం కోసమే.. లక్ష్మణ్ విమర్శలు!

Telangana Elections 2023: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ (MP Laxam) . బీజేపీ మేనిఫెస్టో (BJP Manifesto) సంక్షేమం కోసం అయితే .. బీఅర్ఎస్ (BRS), కాంగ్రెస్ ల (Congress Manifesto) మేనిఫెస్టోలు సంక్షోభం కోసమని ఎద్దేవా చేశారు. ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మేనిఫెస్టోలు తయారు చేస్తున్నాయి తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదని అన్నారు. అప్పు చేసి పప్పు కూడు తినడం ప్రణాళిక కాదని అన్నారు. ఉచితం పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ALSO READ: నాకు ప్రాణహాని ఉంది.. బీఆర్ఎస్ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ తెలంగాణలో చెప్పే మేనిఫెస్టో సరేకానీ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక (Karnataka), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రలలో ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచేందుకు తప్పుడు సర్వేలు (Election Survey) చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ సర్వేలన్నీ పట పంచలవ్వడం ఖాయమని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అగ్ర నేతలు పర్యటించనున్నారని తెలిపారు. బీఅర్ఎస్, కాంగ్రెస్ లు ఈ ప్రచారాన్ని తట్టుకోలేక పోతాయని చురకలు అంటించారు. కేటీఆర్ (KTR) మోదీని (Modi) విమర్శించే స్థాయి కాదని అన్నారు.

ALSO READ: ఒకే విడతలో రూ.10లక్షలు.. సీఎం కేసీఆర్ సంచలన హామీ

బీఅర్ఎస్ నేతలను ప్రచారానికి రానివ్వకుండా ప్రజలు తిరగబడి వెనక్కి పంపిస్తున్నారని అన్నారు. గాంధీ కుటుంబానికి సేవ చేయడమే కాంగ్రెస్ గ్యారంటీలు అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మేనిఫెస్టోలో జరిగేవి కావని.. మోదీ గ్యారెంటీ అంటేనే జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు.

Advertisment
తాజా కథనాలు