TS Elections: నాకు ప్రాణహాని ఉంది.. బీఆర్ఎస్ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు

చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కాంగ్రెస్ నేతల నుండి ప్రాణహాని ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.

BRS: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన నేతలు
New Update

Telangana Elections 2023: చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ (Sunke Ravi Shankar) ఎన్నికల వేళ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని అన్నారు. కాంగ్రెస్ గూండాల నుండి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. తనపై దాడులు జరుగుతున్న పోలీసులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. తనకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు దాడులు జరుగుతుంటే వీడియోలు తీస్తున్నారని మండిపడ్డారు.

publive-image సుంకే రవిశంకర్

ALSO READ: ఒకే విడతలో రూ.10లక్షలు.. సీఎం కేసీఆర్ సంచలన హామీ

బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సుంకె రవిశంకర్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. తనపై జరిగిన దాడిపై సుంకె రవిశంకర్ స్పందించారు. రవీందర్ మాట్లాడుతూ.. నీలోజిపల్లి గ్రామంలో నాపై దాడికి ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాపాడారని అన్నారు.

ALSO READ: కొట్టుకున్న BRS, కాంగ్రెస్ శ్రేణులు.. ఎక్కడంటే?

దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు నాగి శేఖర్‌ను కూడా నిన్న రాత్రి కాంగ్రెస్ నాయకులు వెంటాడారని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.

#telugu-news #congress #telangana-elections-2023 #brs-mla
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe