TS Elections: కాంగ్రెస్ కు చంద్రబాబు సపోర్ట్.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

ఈ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు కాంగ్రెస్ పార్టీకే అని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి. ఈసారి ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

TS Elections: కాంగ్రెస్ కు చంద్రబాబు సపోర్ట్.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
New Update

Telangana Elections 2023: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు (Chandra Babu) గతంలో మేము సహకరించాం.. ఇప్పుడు ఆయన మాకు సపోర్టు ఇస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రేణుకా చౌదరి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ALSO READ: నాకు ప్రాణహాని ఉంది.. బీఆర్ఎస్ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు

ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో రేణుకా చౌదరి మాట్లాడుతూ.. రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు అడ్డు పడ్డా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది కాంగ్రెస్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్లాయని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లతో నిరుద్యోగులను కేసీఆర్ (KCR) మోసం చేశారని మండిపడ్డారు,

18 ఏళ్ళ యువతీ యువకులకు ఓటు హాక్కు కల్పించింది రాజీవ్ గాంధీ అని అన్నారు. బీఆర్ఎస్ కొత్త సినిమాను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేశారు. మైనారిటీలు కాంగ్రెస్ వెంట ఉన్నారని తెలిపారు. ఎంఐఎంకి మైనారిటీలు దూరం అయ్యారని పేర్కొన్నారు.

ALSO READ: ఒకే విడతలో రూ.10లక్షలు.. సీఎం కేసీఆర్ సంచలన హామీ

తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వెల్లడించారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో కడుతుండంగానే డబుల్ బెడ్ రూం ఇళ్ళు కూలిపోతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ హయంలో లక్షలాది మంది ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టించమని పేర్కొన్నారు. చంద్రబాబుకు గతంలో మేము సహకరించాం.. ఇప్పుడు ఆయన మాకు సపోర్టు ఇస్తున్నారని తెలిపారు.

కేటీఆర్ (KTR) ఐటీ కింగ్ అంటారు. కానీ, జాబ్స్‌ మాత్రం ఇవ్వరని ఎద్దేవా చేశారు. సీఎం పదవిని చాలా మంది ఆశిస్తారని.. అది గెలిచ వచ్చిన వారి హాక్కు అని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం ఫైనల్‌ అని తేల్చి చెప్పారు.

#brs #congress #chandrababu #telangana-elections-2023 #renuka-chowdary
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe