Congress: 'గులాబీ జెండా ఎగరలేదు'.. 'మార్పురావాలి' అందరి నోళ్లలో నానింది..బీఆర్‌ఎస్‌ ఫెయిల్ అయింది అక్కడే!

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపుకు ప్రధాన కారణాల్లో సోషల్‌మీడియా ఒకటి. ముఖ్యంగా 'మార్పు రావాలి.. కాంగ్రెస్‌ రావాలి' థీమ్‌తో హస్తం పార్టీ చేసిన సోషల్‌మీడియా క్యాంపెయిన్‌ సూపర్‌ హిట్ అయ్యింది. 'గులాబీజెండా'లను ఎగరకుండా చేసి 'మార్పు'కు పట్టం కట్టేలా చేసింది.

New Update
Congress: 'గులాబీ జెండా ఎగరలేదు'.. 'మార్పురావాలి' అందరి నోళ్లలో నానింది..బీఆర్‌ఎస్‌ ఫెయిల్ అయింది అక్కడే!

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న ఆకాశ్‌ నెల రోజులుగా రోజూ ఇంట్లో 'మార్పు రావాలి.. కాంగ్రెస్‌ రావాలి..' అంటూ సాంగ్‌ పాడుతున్నాడు. చదువుకుంటున్న టైమ్‌లో కూడా మధ్యమధ్యలో తనకు తెలియకుండానే ఆ లైన్స్‌ని హమ్‌ చేస్తున్నాడు. 'ఇదేంటి మా వాడు టీవీ పెద్దగా చూడడు కదా, ఈ కాంగ్రెస్‌ వాళ్ల ప్రచార సాంగ్‌ను ఎక్కడ విన్నాడో ఏమో' అనుకుంటూ ఆలోచనలో పడింది వినోద. తెలంగాణ(Telangana)లో ఎక్కడ చూసినా ప్రజల నోళ్లలో 'మార్పు రావాలి...' అంటూ మాటలు, పాటలు, హమ్మింగ్‌లు వినిపించాయి. ఇదంతా కాంగ్రెస్‌ చేసిన సోషల్‌మీడియా మాయ. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఎన్నికలను ప్రభావితం చేసే అంశల్లో సోషల్‌మీడియా చాలా కీలకమైనది. అందుకే 5వ తరగతి అబ్బాయి నుంచి 80ఏళ్ల వృద్ధుడు వరకు అంతా 'మార్పు రావాలి.. కాంగ్రెస్‌ రావాలి(Maarpu Raavali Congress Raavali)..'అని వాళ్లకి తెలియకుండానే పాడుకున్నారు. నెల రోజుల ముందు వరకు 'కారు..సారు..సర్కారు' అని చెప్పి'నోళ్లంతా' చివరి నిమిషంలో మార్పు రావాలంటూ కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. అటు ముమ్మాటికి కాంగ్రెస్‌ సోషల్‌మీడియా(Social Media) సాధించిన విజయమే.

సోషల్‌మీడియా చూపే ప్రభావం లెక్కకట్టలేనిది:

ఎన్నికలకు ముందు రోడ్లపై జరిగే ప్రచారం ఒక ఎత్తైతే.. సోషల్‌మీడియాలోనూ, అడ్వర్‌టైజ్‌మెంట్లలోనూ పోలిటికల్‌ పార్టీలు చేసే ప్రచారం మరో ఎత్తు. సోషల్‌మీడియా రీచ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రీచ్‌ రేంజ్‌ ఎంతంటుందో తెలిపే లెక్కలేవీ లేవు కానీ.. రిజల్ట్స్‌ రిలీజైన తర్వాత అవి ఎంతగా ప్రభావితం చేసేయో తెలిసిపోతుంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన విజయం చూస్తే ప్రజల్లో 'కారు' నుంచి 'మార్పు'కు ఓటు వెయ్యలన్న ఆలోచన ఎంతగా మారిందో తెలిసిపోయింది. కొన్ని జిల్లాలను దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది కాంగ్రెస్‌. ఇదంత రేవంత్‌ వల్ల జరిగిందని, రాహుల్ జోడో యాత్ర వల్ల జరిగిందని, భట్టి విక్రమార్క వల్ల జరిగిందని ఎవరీ అభిప్రాయాన్ని వాళ్లు వ్యక్తం చేస్తున్నా.. సోషల్‌మీడియా చూపించిన ఇంపాక్ట్‌ని మాత్రం ఎవరూ విస్మరించకూడదన్నది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.

అటు గులాబీ జెండలే:
మరోవైపు బీఆర్‌ఎస్‌ సైతం తెలంగాణ ట్రెడిషనల్‌ స్టైల్‌లో తమ ఆటలను, పాటలను సోషల్‌మీడియా వేదికగా ప్రచారం చేసింది. 'గులాబీ జెండాలే' పాట సోషల్‌మీడియాలో కాకపెట్టింది. సెలబ్రెటీలు, బుల్లితెర తెర తారలు ఎక్కువగా ఆ పాటను ప్రమోట్ చేస్తు కనిపించారు. అమెరికా, యూకేతో పాటు ఇతర దేశాల నుంచి రీల్స్ చేసి ఇన్‌స్టా వేదికగా అప్‌లోడ్‌ చేశారు. వీటికి కేటీఆర్‌ రిపోస్ట్ చేస్తూ ఎంకరేజ్‌ చేశారు. అదిరే స్టెప్పులతో 'గులాబిజెండలే' పాటను బీఆర్‌ఎస్‌ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అదే సమయంలో 'కారు టైరు గాలి' పోయే అడ్వర్‌టైజ్‌మెంట్లతో పాటు కేసీఆర్‌ను పోలిన ఓ వ్యక్తిని యాడ్స్‌లో రంగంలోకి దింపిన కాంగ్రెస్‌ రూరల్ ఏరియ ఓటర్లను ఆకర్షించింది. 'కేసీఆర్‌ డూప్‌ భలే ఉన్నాడు చూడండి' అంటూ ఊరు-వాడ అంతా ఈ యాడ్స్‌ గురించి చర్చించుకున్నారు. పనిలోపనిగా ఆ యాడ్స్‌లో బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ చేసే విమర్శలను డిస్కస్‌ చేసుకున్నారు.. నిరుద్యోగం, పేపర్ లీకేజీ, కాళేశ్వరం,.. ఈ పదాలు తెలియకుండానే ప్రజల మనసుల్లో పేరుకుపోయాయి. సోషల్‌మీడియా యాడ్స్‌ ప్రభావితం అలా ఉంటుంది.. చదువుకున్నోడు- చదువుకోనుడు, స్కూల్‌కు వెళ్లే పిల్లోడు-అదే స్కూల్‌లో పాఠాలు చెప్పే పంతులు, ఉన్నోడు-లేనోడు, కుల-మత-ప్రాంతలతో సంబంధం లేకుండా అందరికి సోషల్‌మీడియా ప్రచారం రీచ్‌ అయ్యింది. అదే కాంగ్రెస్‌ మ్యాజిక్‌కు ప్రధాన కారణమైంది..!

Also Read: కోహ్లీ, రోహిత్‌కు కూడా లేని రికార్డు.. రింకూ సింగ్‌ రేంజ్‌ అలాంటిది మరి!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు