Rinku singh: కోహ్లీ, రోహిత్‌కు కూడా లేని రికార్డు.. రింకూ సింగ్‌ రేంజ్‌ అలాంటిది మరి!

ఇప్పటివరకు రింకూ సింగ్‌ ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడగా.. ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ 20 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. ఇలా మొదటి 5 టీ20ల్లో ఏ ఇండియన్ ప్లేయర్‌ కూడా అన్నీ మ్యాచ్‌ల్లోనూ 20 కంటే ఎక్కువ రన్స్ చేయలేదు.

New Update
Rinku singh: కోహ్లీ, రోహిత్‌కు కూడా లేని రికార్డు.. రింకూ సింగ్‌ రేంజ్‌ అలాంటిది మరి!

వరల్డ్‌కప్‌ ఓడిపోయిన తర్వాత టీమిండియా అభిమానులు కాస్త డల్ అయ్యారు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. టీ20 కావడంతో వ్యూయర్‌ షిప్‌ ఉంది కానీ.. గతంలో ఉన్నంత ఆసక్తి ఫ్యాన్స్‌లో కనిపించలేదు. 3-1 తేడాతో టీ20 సిరీస్‌ గెలుచుకున్నా అంత ఆనందం కూడా కలగడంలేదు ఫ్యాన్స్‌కి. అయితే ఒక విషయంలో మాత్రం ఫ్యాన్స్‌ కాస్త శాటిస్‌ఫై అయ్యారు. అదే రింకూ సింగ్‌(Rinku Singh). అవును.. ప్రస్తుతం రింకూ సింగ్‌ గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఫ్యాన్స్ అందరూ రింకూ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. అందివచ్చిన ఛాన్సులను అద్భుతంగా వినియోగించుకుంటున్న రింకూసింగ్‌ను ఇప్పటికే ధోనీతో కంపేర్ చేస్తూ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు.

రింకూ సింగ్‌ అదిరే రికార్డు:
ఇప్పటివరకు ఐదు టీ20లు ఆడిన రింకూ సింగ్‌ అరుదైన ఫీట్ సాధించాడు. ఈ ఐదు టీ20ల్లోని ఏ మ్యాచ్‌లోనూ 20కంటే తక్కువ రన్స్ చేయలేదు. ఇలా మొదటి ఐదు టీ20లు ఆడి ఏ మ్యాచ్‌లోనూ 20కంటే తక్కువ రన్స్ చేయని ఏకైక ప్లేయర్ ఇండియానుంచి రింకూ సింగ్‌ మాత్రమే. ఈ ఐదు టీ20ల్లో 38, 37*, 22*, 31*, 46 రన్స్ చేశాడు రింకూ.

ఆ మ్యాచ్‌తో మలుపు:
ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై మ్యాచ్‌ అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. ఒక్కసారిగా రింకూ టాలెంట్ ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఏప్రిల్ 9, 2023న, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకు రికార్డ్-బ్రేకింగ్ ఫీట్‌ను సాధించాడు. చివరి ఓవర్‌లో 5 సిక్సర్లు కొట్టి 29 పరుగులను విజయవంతంగా ఛేదించాడు. టోర్నమెంట్ చరిత్రలో చివరి ఓవర్‌లో అత్యధిక ఛేజ్ చేసిన రన్స్ ఇవి. అప్పటి నుంచే టీమిండియాకు మరో ధోనీ(Dhoni) దొరికేశాడని ఫ్యాన్స్‌ లెక్కలు కట్టేశారు. ఇక తాజా ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లోనూ రాణించడంతో టీమిండియాకు ఫినీషర్‌ లోటు తీరినట్లేనని చెబుతున్నారు.

Also Read: మీ కష్టం పగోడికి కూడా రాకూడదు భయ్యా.. లగేజీలు మోసుకున్న పాకిస్థాన్‌ ఆటగాళ్లు!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు