Vijayashanthi: సినిమాల్లో మాదిరి రాజకీయాల్లో ద్విపాత్రాభినయం కుదరదని...ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలమని బీజేపీ నేత, నటి విజయశాంతి అభిప్రాయపడ్డారు.తన 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణం గురించి ఆమె ఆసక్తికర ట్వీట్ చేసిన వెంటనే ఆమె మరో ట్వీట్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బీఆర్‌ఎస్(BRS) నుంచి ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి నన్ను పోరాడమని కొందరు, బీజేపీ (BJP) వైపై నిలిచి పోరాడాలని మరికొంత బిడ్డలు తనను కోరారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
నన్ను పోరాడమని అడుగుతున్న ఇరు పక్షాల వారి అభిప్రాయాలు కరెక్టే. ఎన్నో త్యాగాలు, ఎన్నో కోట్లాటలు చేసి సాధించుకున్న తెలంగాణ కోసం పోరాడాలి. కానీ ఏదో ఒక్క పార్టీ తరుఫున మాత్రమే ఉండగలం అని విజయశాంతి (Vijayashanthi) అన్నారు. తెలంగాణ రాజకీయాల పై ఆమె తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
Also read: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..దిగి వచ్చిన బంగారం ధరలు..3 రోజుల్లో ఎంత తగ్గిందంటే!
‘బీఆర్ఎస్ దుర్మార్గాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు, బీజేపీ వైపు నిలబడాలని ఇంకొందరు అంటున్నారు. రెండు అభిప్రాయాలు మన తెలంగాణ మేలు కోసమే. అయితే పోలీసు లాకప్, రౌడీ దర్బార్, నాయుడమ్మ లాంటి సినిమా తరహాలో ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాల్లో సాధ్యపడదు. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలం. హర హర మహాదేవ, జై శ్రీరామ్, జై తెలంగాణ’ అని విజయశాంతి తన ఎక్స్‌లో (Twitter) పేర్కొన్నారు.
ఆమె బుధవారం కూడా తన 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణం గురించి పోస్ట్ చేశారు. ’25 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణం, అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే నాకు ఇస్తూ వచ్చింది. ఏ పదవి ఏనాడు కోరుకోకున్నా… ఇప్పటికీ పదవుల గురించి అనుకోవటం లేదు. అయితే ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం. మన పోరాటం నాడు దశాబ్దాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప.. ఇయ్యాల్టి బీఆర్ఎస్‌కు వ్యతిరేకం అవుతాం అని కాదు.
Also read: ఘోర పడవ ప్రమాదం…18 మంది గల్లంతు..3 మృతదేహాలు లభ్యం!
నా పోరాటం నేడు కేసీఆర్ (KCR) గారి కుటుంబ దోపిడి, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప, నాతో కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదు. రాజకీయపరంగా విభేదించినప్పటీకి అన్ని పార్టీల తెలంగాణ బిడ్డలు అందరూ సంతోషంగా, సగౌరవంగా ఉండాలని మనఃపూర్వకంగా కోరుకోవటం మీ రాములమ్మ ఒకే ఒక్క ఉద్దేశ్యం.. ఎప్పటికీ. హర హర మహాదేవ్. జై తెలంగాణ’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.