Telangana: ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి.. వారి పనే అంటూ ఫైర్.. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి అటాక్ జరిగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై ఓ వ్యక్తి మట్టి పెళ్లను విసిరాడు. ఈ దాడి కాంగ్రెస్ వాళ్ల పనే అంటూ బాలరాజు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి దాడి చేసినట్లు కొందరు చెబుతున్నారు. By Shiva.K 14 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Guvvala Balaraju: అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమ్రాబాద్ మండలంలోని కుమొరోనిపల్లిలో సోమవారం గువ్వల బాలరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా.. మల్లిపెళ్లను విసిరారు. ఆ మట్టి పెళ్ల గువ్వల బాలరాజుకు తగిలింది. అయితే, ఈ ఘటనతో షాక్ అయిన బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. బాలరాజుపై దాడి చేసిన వ్యక్తిని పర్వతాలుగా గుర్తించారు పోలీసులు. అయితే పర్వతాలుకు మతిస్థితిమితం లేదని, ఊళ్లో అందరిపై ఇలాగే దాడులు చేస్తుంటాడని పలువురు చెబుతున్నారు. కానీ, ఈ వాదనను బీఆర్ఎస్ శ్రేణులు ఖండిస్తున్నారు. ఈ దాడి ఖచ్చితంగా కాంగ్రెస్ పనే అని ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన దాడికి కొనసాగింపుగానే.. ఇప్పుడు రాళ్లతో అటాక్ చేశారని అంటున్నారు. గువ్వల బాలరాజు కూడా తనపై పడిన మట్టి పెళ్లను చూపిస్తూ.. కాంగ్రెస్ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అసలేం జరిగింది? ఇందులో కుట్ర ఏమైనా ఉందా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా నేడు అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లిలో ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ గుండాలు అచ్చంపేట అసెంబ్లీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారిపై కాంగ్రెస్ గుండాలు రాళ్ల దాడి చేయడంతో చేతి కి తగిలింది. pic.twitter.com/bg3WYRx8sm — Guvvala Balaraju (@GBalarajuTrs) November 13, 2023 అచ్చంపేటలో శనివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దుండగులు అటాక్ చేశారు. ఈ దాడిలో బాలరాజు గాయపడగా.. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి చేరారు. చికిత్స అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో గువ్వల బాలరాజు మళ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. దాడి జరగడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. Also Read: టార్గెట్ నకిరేకల్.. వేముల వీరేశం ఓటమికి కేసీఆర్ స్కెచ్ ఇదే! మేం అధికారంలోకి వస్తే ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం..!! #telangana-news #telangana-elections #telangana-politics #guvvala-balaraju-attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి