TS Covid Updates: తెలంగాణలో మళ్లీ కరోనా కల్లోలం.. హైదరాబాద్ లో 14 నెలల చిన్నారికి ఆక్సిజన్.

దేశంలో మళ్ళీ కరోనా విజృంభిస్తోంది. కొత్త జేఎన్1 న్యూ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వైరవిహారం చేస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలో 14 నెలల చిన్నారికి కోవిడ్ సోకింది. ప్రస్తుతం ఆక్సిజన్ మీద ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

తెలంగాణలో కరోనా స్వైరవిహారం.. 24గంటల్లో ఎన్ని కేసులు పెరిగాయంటే
New Update

Covid Cases in Telangana: ఒక్కసారిగా మళ్ళీ పాత రోజులు వచ్చేశాయి. ప్రజలు మాస్కులతో ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టడానికి భయపడే రోజులు మళ్ళీ వస్తాయనే గుబులు మొదలైంది. దేశంలో కొత్త కరోనా వేరింట్ (Corona Variant) కలకలం సృష్టిస్తోంది. 24 గంటల్లోనే 594 కేసులు నమోదు అయి అలజడి రేపుతోంది. ఆంధ్రాలో 3 కొత్త కేసులు, బీహార్ లో రెండు కొత్త కేసులు నమోదవ్వగా...దేశ వ్యాప్తంగా 328 కొత్త కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ చెబుతోంది.  దానికి తోడు ఒక్కరోజులోనే వైరస్‌తో ఆరుగురు మృతి చెందడం భీతి కొలుపుతోంది. కొత్త లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,997కి చేరింది.

Also read:లెక్కల గురువును స్మరించుకుందాం…జాతీయ గణితదినోత్సవం జరుపుకుందాం

తెలుగు రాష్ట్రాల్లోనూ కొవిడ్‌ పంజా విసురుతోంది. ఒక్క తెలంగాణలోనే 24గంటల్లో 6కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 19కి చేరాయి. గత 24గంటల్లో 925 కరోనా టెన్టులు (Corona Tests) చేశారు. దీంట్లో హైదరాబాద్‌లో (Hyderabad) కొత్తగా మరో 4 కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. మెదక్‌,రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొ కేసు నమోదయ్యాయి. వరంగల్ లో కూడా ఒక అతనిలో కరోనా లక్షనాలు కనిపించాయని చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ కేసుల కట్టడికి చర్యలు తీసుకోవటంతో పాటు మహమ్మారి విజృంభిస్తే సమస్య లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఆస్పత్రులను కూడా సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్ధవంతంగా ఎదుర్కొనేలా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు.
చెస్ట్‌ హాస్పిటల్‌లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. కొత్త వేరియంట్‌ను గుర్తించేలా టెస్టులు పెంచుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదని.. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. ఇక ఆంధ్రలో కూడా కొత్త కరోనా వేరియంట్ కేసులు ఉన్నాయని తెలుస్తోంది. దీని మీద అక్కడి సీఎం జగన్ ఈ రోజు ఉదయం 11 గంటలకు సమీక్ష నిర్వహించనున్నారు. టెస్టులు, వ్యాక్సిస్, ఆసుపత్రుల సిద్ధం కోసం వైద్యాధికారులతో మాట్లాడనున్నారు.

ప్రస్తుతం జేఎన్1 న్యూ వేరియంట్ విస్తరిస్తోంది. కేరళ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు.

మరోవైపు నాంపల్లి 14 నెలల చిన్నారికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె నీలోఫర్ లో చికిత్స పొందుతోంది. చిన్నారికి ఆక్సిజన్ ఏర్పాటు చేశామని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఇక ప్రపంచంలోని 38 దేశాల్లో జేఎన్.1 కరోనా కేసులు నమోదయ్యాయి. జేఎన్. 1 కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వైరస్ కారణంగా ప్రజారోగ్యానికి అంతగా ముప్పు లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల 19న ప్రకటించింది.

#telangana #corona #updates #covid #covid-cases
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe