ప్రతీ సినిమాకు ఆనవాయితీ ఇది | Viswak sen Visited |Tirumala Tirupati | RTV
సిగరెట్ నిప్పు ఓ ప్రాణం తీసిన విషాద ఘటన గుడివాడలో చోటుచేసుకుంది. వృద్ధుడు అయిన ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిప్పు మంచానికి అంటుకోవడంతో మంటల్లో చిక్కుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఏపీలో మంగళవారం నుంచి ఈనెల 27 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిన వారికి అప్డేట్ చేయడంతో పాటు ఇంటి అడ్రస్, వయసు, పేరు మార్పు, కొత్త ఆధార్ నమోదు వంటి సేవలు అందించనున్నారు.
దేశంలో మళ్ళీ కరోనా విజృంభిస్తోంది. కొత్త జేఎన్1 న్యూ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వైరవిహారం చేస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలో 14 నెలల చిన్నారికి కోవిడ్ సోకింది. ప్రస్తుతం ఆక్సిజన్ మీద ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యుల మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. మెడికల్ రిపోర్ట్ ను బయటపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ చెప్పుకొచ్చిన జైలు అధికారులు.