Parliament Elections : పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థులు వీరే!

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 15 స్థానాల్లో విజయమే టార్గెట్ గా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. 10 స్థానాల్లో అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. మరో 5, 6 స్థానాల అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది.

New Update
Parliament Elections : పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థులు వీరే!

Telangana Congress : లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ(Telangana) కాంగ్రెస్‌ ఫోకస్‌ పెట్టింది. 15 సీట్లలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలు ఉండటంతో.. నియోజకవర్గాలవారీ పార్టీ ఇన్‌ఛార్జుల నియామకం చేసింది. ఇప్పటికే 10 నుంచి 11 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై క్లారిటీగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మరో 5 నుంచి 6 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. మూడు సిట్టింగ్‌ స్థానాల్లో కొత్త అభ్యర్థులకు ఛాన్స్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో.. మూడు ఎంపీ స్థానాలకు రాజీనామా చేశారు రేవంత్‌, ఉత్తమ్‌, కోమటిరెడ్డి.

ALSO READ: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోజు నుంచే వారికి రూ.2,500?

ఎమ్మెల్యే ఎన్నికల్లో అవకాశం దక్కని నేతలకు లోక్‌సభ ఎన్నికల్లో ప్రయారిటీ ఇచ్చేందుకు కాంగ్రెస్(Congress) అధిష్టానం మొగ్గుచూపుతోంది. సోనియాను తెలంగాణ నుంచి పోటీచేయాలని పీసీసీ కోరింది. సోనియా పోటీపై అధిష్టానం నుంచి క్లారిటీ ఇంకా రాలేదు. వయస్సు, ఆరోగ్య కారణాల రీత్యా వచ్చే ఎన్నికల్లో సోనియా పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. సోనియా పోటీకి ఓకే అంటే నల్గొండ లేదా ఖమ్మం నుంచి బరిలో దింపే అవకాశం ఉంది. మల్కాజ్‌గిరి సీటుకు గట్టి పోటీ ఉంది. ఈ టికెట్‌ కోసం మైనంపల్లి హన్మంతరావుతో పాటు పలువురు నేతల పోటీ పడుతున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: సీఎం రేవంత్ కీలక భేటీ.. ధరణి రద్దు, రైతు బంధు అంశాలపై కసరత్తు

చేవెళ్ల బరిలో బలమైన అభ్యర్థికోసం కాంగ్రెస్ అధిష్టానం చూస్తోంది. బీజేపీ(BJP) కి చెందిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని.. పార్టీలో చేర్చకుని టికెట్‌ ఇవ్వాలనే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉందని సమాచారం. సికింద్రాబాద్‌ లోక్‌సభ టికెట్‌ను.. అంజన్‌కుమార్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌లలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్‌ టికెట్‌ వంశీచందర్‌రెడ్డికి ఇచ్చే ఛాన్స్‌... కల్వకుర్తి టికెట్‌ ఇవ్వకపోవడంతో ఎంపీ టికెట్‌ హామీ ఇచ్చిన అధిష్టానం. జహీరాబాద్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌కు హామీ.. ఎమ్మెల్యే ఎన్నికల బరినుంచి చివరి క్షణంలో షెట్కార్‌ను తప్పించింది అధిష్టానం. జహీరాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇస్తామని గతంలోనే సురేష్‌ షెట్కార్‌కు చెప్పిన హైకమాండ్. ఆదిలాబాద్‌ లోక్‌సభ టికెట్‌ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌. నాగర్‌కర్నూల్‌ రేసులో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. మెదక్‌ టికెట్‌ ఆశిస్తున్న జగ్గారెడ్డి.. తన భార్యకు అయినా టికెట్‌ ఇవ్వాలంటున్న జగ్గారెడ్డి. కరీంనగర్‌ బరిలో ప్రవీణ్‌రెడ్డి. నిజామాబాద్‌ బరిలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి. వరంగల్‌ టికెట్‌ అద్దంకి దయాకర్‌కు ఇచ్చే ఛాన్స్‌. మహబూబాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ లేదా నెహ్రూ నాయక్‌లో ఒకరికి ఛాన్స్‌. నల్గొండ టికెట్‌ పటేల్‌ రమేష్‌రెడ్డికి ఇస్తామని గతంలో హామీ. నల్గొండ టికెట్‌ తనకు కావాలంటున్న జానారెడ్డి.. జానారెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్‌ ఇస్తే.. పటేల్‌ రమేష్‌రెడ్డికి కేబినెట్‌ ర్యాంకు నామినేటెడ్‌ పోస్టు ఇచ్చే అవకాశం ఉంది. భువనగిరి టికెట్‌ రేసులో పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి. ఖమ్మం టికెట్‌ కోసం బరిలో ముగ్గురు.. తన సోదరుడికి సీటు కావాలంటున్న మంత్రి పొంగులేటి. తన భార్యను పోటీకి దింపే యోచనలో డిప్యూటీ సీఎం భట్టి.. ఈసారి ఖమ్మం టికెట్‌ ఇవ్వాల్సిందేనంటున్న రేణుకా చౌదరి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు