CM Revanth Reddy: ఎవడ్రా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

నిన్న ఇంద్రవెల్లి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అని ఎవడ్రా అన్నది అంటూ ఘాటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అని ప్రశ్నించారు.

New Update
CM Revanth Reddy: ఎవడ్రా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

CM Revanth Reddy Comments On KCR: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇంద్రవెల్లిలో (Indravelli Public Meeting) జరిగిన ఈ సభలో నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు. వచ్చే 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల (Constable Posts) భర్తీ చేసే బాధ్యత తమ మంత్రివర్గం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దాంతో పాటూ త్వరలోనే రూ.500లకు గ్యాస్ సిలెండర్‌ను (Gas Cylinder) కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (Free Current) కూడా ఇస్తామని అన్నారు.

Also Read:Breaking: విశాఖలో దారుణం…ఎమ్మార్వో హత్య

బీఆర్ఎస్‌కు స్ట్రాంగ్ కౌంటర్...

ఇక దీని తర్వాత బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రతిపక్ష నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీ అయ్య ఎవడ్రా పడగొట్టేటోడు...పడగొడతార్రా...ఎవరు కొట్టేది అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది ప్రజలు ఎన్నుకున్న , ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం..ప్రజల కోసం పని చేస్తున్న ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. వాళ్ళు అనుకుంటున్నారు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్లు ఈ ప్రభుత్వం కూలుతుందా అని నిలదీశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ (KCR) ఖాన్ దాన్ మొత్తం వచ్చినా ఏమీ చేయలేరని రేవంత్ తీవ్రంగా విమర్శించారు. మూడు నెలలకో, ఆరు నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా అంటే పళ్ళు రాలగొడతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు..

అక్కడితో ఆగకుండా కేసీఆర్ మీద డైరెక్ట్‌గా విరుచుకుపడ్డారు. ఆయన ఫామ్‌హౌజ్‌కు సీఎం కావాల్సిందే తప్ప తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. కేసీఆర్ పాపాల భైరవుడు అంటూ విమర్శించారు. రాఫ్ట్రంలోని నిరుద్యోగులను, అమరవీరుల కుటుంబాలను, ఉద్యమకారులను, రైతులను, దళితులను, మహిళలను కేసీఆర్ నిలువుదోపిడీ చేశారంటూ మండిపడ్డారు. ఎప్పుడూ ఫామ్ హౌజ్ ఎలా కట్టాలి, ఎలా డెవలప్ చేయాలని అలోచించావు తప్ప ప్రజల గురించి ఆలోచించలేదని డైరెక్ట్‌ ఎటాక్ చేశారు రేవంత్ రెడ్డి.

Advertisment
Advertisment
తాజా కథనాలు