CM Revanth Reddy : ప్రధాని అంటే పెద్దన్న.. మోదీ మనసు దోచుకున్న తెలంగాణ సీఎం

తెలంగాణలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీకి సాదరంగా ఆహ్వానం పలికారు. అంతేకాదు ప్రధానమంత్రి అంటే తమకు పెద్దన్న లాంటి వారని.. కేంద్రంతో స్నేహభావంతో మెలుగుతామని రేవంత్ ప్రకటించారు.

New Update
CM Revanth Reddy : ప్రధాని అంటే పెద్దన్న.. మోదీ మనసు దోచుకున్న తెలంగాణ సీఎం

PM Modi : ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ప్రధాని మోదీ(PM Modi) పర్యటించారు. దాదాపు ఆరున్నర వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏర్పడ్డాక ప్రధాని మోదీ మొట్టమొదటి సారిగా ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి సాదరంగా ఆహ్వానం పలికారు. ఆదిలాబాద్ బహిరంగ సభలో మోదీతో పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరు వచ్చినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం మీకు స్వాగతం పలకడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు.

ప్రధాని అంటే మాకు పెద్దన్న..

కేంద్రంతో ఘర్షణ పడడం మా వైఖరి కాదు అని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఆదిలాబాద్(Adilabad) బహిరంగ సభలో మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పడుతుంటే రాష్ట్ర అభివృద్ధి వెనుక పడుతుందని అన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కార్యాచరణతో ముందు వెళుతుందని తెలిపారు. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవని..ప్రధానమంత్రి అంటే తమకు పెద్దన్నలాంటివారని అన్నారు. గుజరాత్‌లా తెలంగాణ కూడా అభివృద్ధి చెందేందుకు మోదీ సహకరించాలని కోరారు. తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. విభజన చట్టంలో నాలుగువేల మెగావాట్లకు బదులు కేవలం 1600 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే తెలంగాణకు వచ్చింది. దేశంలో ఐదు ట్రిలియన్‌ ఎకానమీ సాధనకు తెలంగాణ సహకరిస్తోంది. కంటోన్మెంట్‌ రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించారు. ఇది తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన స్కైవేల నిర్మాణానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ప్రాజెక్ట్‌లో మిగిలిన వాటికి కూడా సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి మీ ఆశీర్వాదం కావాలి..

ప్రాణహిత చేవెళ్ల సృజన స్రవంతి ఏర్పాటు చేస్తామని...దానికి మీరు దయచేసి మహారాష్ట్ర గవర్నమెంట్ తో ల్యాండ్ ఆక్టివేషన్ విషయంలో పర్మిషన్ ఇప్పించాలని కోరుతున్నానని ప్రధాని మోదీకి విన్నవించారు రేవంత్ రెడ్డి. ప్రాణహిత చేవెళ్ల సృజన స్రవంతి ప్రాజెక్టు దగ్గర నిర్మించాలని మా ప్రభుత్వం అనుకుంటోంది...అదే కనుక జరిగితే ఆదివాసిలకు లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందించగలుగుతామని ప్రధానికి వివరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంపై మీ ఆశీర్వాదం ఉందని... ఇకమీదట కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వంతో మేము గొడవలు చేయదలచుకోలేదు స్నేహభావంతోనే మెలుగుతామని హామీ ఇచ్చారు.

Also Read : Telangana : మెగా డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను విడుదల చేసిన విద్యాశాఖ

Advertisment
Advertisment
తాజా కథనాలు