Telanagana: మెగా డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను విడుదల చేసిన విద్యాశాఖ తెలంగాణ మెగా డీఎస్సీ పరీక్షల కోసం అప్లికేషన్ స్వీకరణ మొదలైంది. మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చును. ఈరోజు ఈ దరఖాస్తుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను విడుదల చేసింది విద్యాశాఖ. By Manogna alamuru 04 Mar 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది.మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షలు మే/జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ , లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తోపాటు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటూ మరో నోటిపికేషన్‌ను కూడా విడుదల చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఈ నోటిఫికేషన్‌లో 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), 2,629 స్కూల్ అసిస్టెంట్లు (SA), 727 లాంగ్వేజ్ పండిట్లు (LP), 182 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET), 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 220 పోస్టులు, 79 SA క్యాడర్ కింద ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులలో గత బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం నోటిఫై చేసిన 5,089 ఖాళీలు కూడా ఉన్నాయి. మెగా డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. మార్చి 4 అంటే ఈరోజు నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తారు. ఏప్రిల్ 2 వరకు ఆన్ లైన్‌లో అప్లికేషన్స్ స్వీకరించనున్నారు. ఇక ఈరోజు అప్లికేషన్‌కు సంబంధించి సమగ్ర వివరాలతో బులెటిన్‌ను కూడా విడుదల చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఇందులో డీఎస్సీ అప్లికేషన్‌ను ఎలా నింపాలి, ఎంత ఫీజు కట్టాలి లాంటి విషయాలన్నింటినీ వివరంగా రాశారు. దరఖాస్తులు... డీఎస్సీ ఎగ్జామ్ కోసం మొత్తం దరఖాస్తును అన్‌లైన్‌లోనే నింపాలి. దీంట్లో విద్యార్ధుల వివరాలను అన్నీ పొందుపరచాలి. దాంతో పాటూ విద్యార్ధి సంతకంతో కూడాని పాస్‌పోర్ట్ సైజు ఫోటోను కూడా జత చేయాలి. అప్లికేషన్ ఫీజు రుసుము 1000 రూ. ఇందులో పరీక్ష ఎప్పుడుంటుంది అన్న విషయం మాత్రం చెప్పలేదు. కానీ పరీక్సలు నిర్వహించే సెంటర్లను మాత్రం మెన్షన్ చేశారు. దాని ప్రకారం తెలంగాణలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, మైదరాబాద్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డిల్లో పరీక్షా కేంద్రాలుంటాయి. దీ జిల్లాల్లో ఉన్నవారు జిల్లా కేంద్రాల్లో జరిగే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. మొత్తం వివరాల కోసం ఈ కింద పీడీఎఫ్‌లో చూడవచ్చును. ఇక రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ లో 878 ఖాళీలు ఉండగా.. నల్లగొండలో 605, నిజామాబాద్ 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 ఖాళీలను భర్తీ చేయనున్నారు. Also Read:Jobs: భారత నేవీలో ఉద్యోగాలు..లక్షల్లో జీతాలు #information-bulletin #telanagna #mega-dsc #exams #appilications మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి