Telangana CM:ప్రధానిని కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టిలు ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలవనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ ప్రధానిని కలవడం ఇదే మొదటిసారి. ఈరోజు మధ్యాహ్నం 4.30 గంటలకు మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన వినతులను అందజేయనున్నారు.

New Update
CM Revanth : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు!

దేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన సీఎం అయినా బాధ్యతలు చేపట్టాక ప్రధానిని కలవడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు దేశ ప్రధాని నరేంద్రమోదీని కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బయలుదేరి...4.30 గంటలకు మోదీని కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గత పదేళ్ళల్లో అమలు కావాల్సిన హామీలు, ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇరువురు నేతలు ప్రధానితో చర్చించనున్నారు. ఆ తురవాత దానికి సంబంధించిన వినతి పత్రాలను అందజేయనున్నారు. దీంతో పాటూ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గురించి కూడా అడగనున్నట్లు తెలుస్తోంది.

Also Read:కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు ఆ రోజు నుంచే.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన!

ప్రధాని మోదీతో భేటీ తరువాత రేవంత్ రెడ్డి, భట్టిలు కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా భేటీ అవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే, కేసీ వేణుగోపాల్...వీలయితే రాహుల్ గాంధీని కూడా కలిసి వస్తారని చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులతో పాటూ లోక్ సభలో అనుసరించాల్సిన వ్యూహాలు లాంటి అంశాల మీద చర్చిస్తారని సమాచారం.

Advertisment
తాజా కథనాలు