మహబూబ్‌నగర్ జిల్లా హసన్‌పర్తి, ఖాజీపేట మార్గంలో నడిచే రైళ్లలో మూడింటిని పూర్తిగా నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది.10 రైళ్లను దారి మళ్లించింది.భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయని ప్రకటించింది. కింద తెలిపిన వివరాలకనుగుణంగా రైల్వే ప్రయాణికులు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. అంతేకాకుండా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రైల్వే ట్రాక్‌లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. వాటిని వెంటనే పునరుద్ధరించి యథావిధిగా రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు.
వరంగల్ జిల్లా హసన్‌పర్తి - ఖాజీపేట మార్గంలో రైల్వే ట్రాక్‌పై భారీగా వర్షపు నీరు నిలవడంతో మూడు రైళ్లను పూర్తిగా నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం 9 రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది. సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ (17012), సికింద్రాబాద్ -సిర్పూర్ కాగజ్‌నగర్ (17233), సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (17234) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. తిరుపతి - కరీంనగర్ (12761), కరీంనగర్ - తిరుపతి (12762), సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ (12757), సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (12758) రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
రద్దయిన రైళ్ల వివరాలు ఇవే..
1. సికింద్రాబాద్ – సిర్పూర్ – కాగజ్ నగర్ -(17233)
2. సిర్‌పూర్ –కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ -(17012)
3. సిర్పూర్ –కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ -(17234)
దారి మళ్లించిన రైళ్ల వివరాలు ఇవే..
1. కోబ్రా – కొచ్చువెళ్లి (22647)
2. ఢిల్లీ – హైదరాబాద్ (12724)
3. హెచ్.నిజాముద్దీన్– బెంగళూరు (22692)
4. నిజాముద్దీన్– విశాఖపట్నం (20806)
5. ధనపూర్– సికింద్రాబాద్ (12792)
6. అహ్మదాబాద్– చెన్నై సెంట్రల్ (12655)
7. శ్రీ వైష్ణో దేవి కట్రా – చెన్నై (16032)
8. ఢిల్లీ – తిరువనంతపురం – (12626)
9. ఢిల్లీ – ఎంజీఆర్– సెంట్రల్ చెన్నై (12622)
10. జైపూర్– మైసూర్ (12976)
పాక్షికంగా రద్దయిన రైళ్ల వివరాలు ఇవే..
1. తిరుపతి – కరీంనగర్ -(12761)
2. కరీంనగర్ – తిరుపతి -(12762)
3. సికింద్రాబాద్ – సిర్పూర్ – కాగజ్‌నగర్ -(12757)
4. సిర్‌పూర్ – కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ -(12758)