New Smartphone: వివో అరాచకం.. రెండు స్మార్ట్‌ఫోన్లు ఊరమాస్ - ఫీచర్లు సూపరెహే!

వివో తన Y సిరీస్‌లో Vivo Y50 5G, Y50M 5G రెండు కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లను చైనాలో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్‌లు ఒకేలాంటి డిజైన్, ఒకేలాంటి స్పెసిఫికేషన్‌లతో రిలీజ్ అయ్యాయి. MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్‌ను పొందుతాయి. 6,000mAh బ్యాటరీతో వస్తాయి.

New Update
Vivo Y50 5G, Y50M 5G

Vivo Y50 5G, Y50M 5G

వివో తన Y సిరీస్‌లో రెండు కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లను చైనాలో విడుదల చేసింది. అవి Vivo Y50 5G, Y50M 5G ఫోన్‌లు. ఈ రెండు ఫోన్‌లు ఒకేలాంటి డిజైన్, ఒకేలాంటి స్పెసిఫికేషన్‌లతో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు వివో ఫోన్‌లు MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్‌ను పొందుతాయి. 6,000mAh బ్యాటరీతో శక్తిని పొందుతాయి. 

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

Vivo Y50 5G Price

4GB+128GB ధర రూ. 13,000
6GB+128GB ధర రూ.18,000 
8GB+256GB ధర రూ.23,000
12GB+256GB ధర రూ.26,000గా కంపెనీ నిర్ణయించింది. 

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

Vivo Y50m 5G Price  

6GB+128GB ధర రూ.18,000 
8GB+256GB ధర రూ.23,000
12GB+256GB ధర రూ.26,000గా కంపెనీ నిర్ణయించింది. 

Also Read:ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

Vivo Y50 5G and Vivo Y50m 5G Specifications

Vivo Y50 5G and Vivo Y50m 5G రెండు స్మార్ట్‌ఫోన్‌లు 720x1,600 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల IPS LCD డిస్‌ప్లే, 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నాయి. రెండూ IP64 సర్టిఫైడ్ బిల్డ్‌లతో వస్తాయి. Vivo Y50m 5G, Y50 5G ఫోన్లు 6nm ఆర్కిటెక్చర్‌పై ఆధారపడిన MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. రెండు ఫోన్‌లు Android ఆధారిత OriginOS 5పై నడుస్తాయి. వెనుక భాగంలో ఒకే 13MP కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా ఉంది. భద్రత కోసం ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సౌకర్యం ఉన్నాయి. ఈ రెండు 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు