Vivo X100 Offers: వివో రచ్చ రచ్చ.. రూ.16వేల భారీ డిస్కౌంట్ - 50MP+50MP+64MP కెమెరా హైలైట్!

ఫ్లిప్‌కార్ట్‌ ‘GOAT SALE’లో vivo X100 స్మార్ట్‌ఫోన్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌లు పొందొచ్చు. 12GB RAM + 256 GB స్టోరేజ్ అసలు ధర రూ.68,999 ఉండగా ఇప్పుడు 23 శాతం తగ్గింపుతో కేవలం రూ.52,989 ధరకే కొనుక్కోవచ్చు. అంటే రూ. 16,010 భారీ తగ్గింపు లభిస్తుందన్నమాట. 

New Update
Vivo X100 smartphone offers

Vivo X100 smartphone offers

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌ ‘GOAT SALE’ ప్రకటించింది. ఈ సేల్‌ రేపటి నుండి అంటే జూలై 12 నుండి ప్రారంభమై.. జూలై 17 వరకు అంటే ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు మాత్రం ఇవాళ అర్ధరాత్రి 12 AM నుండి ఈ సేల్‌ మొదలు కానుంది. ఈ సేల్‌లో vivo X100 స్మార్ట్‌ఫోన్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌లు పొందొచ్చు. 

vivo X100 Offers

 FLIPKART GOAT SALEలో vivo X100 స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపుతో కొనుక్కోవచ్చు. దీని 12 GB RAM + 256 GB స్టోరేజ్ అసలు ధర రూ.68,999 ఉండగా ఇప్పుడు 23 శాతం లభిస్తోంది. ఈ తగ్గింపుతో vivo X100 ఫోన్ కేవలం రూ.52,989 ధరకే ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. అంటే రూ. 16,010 భారీ తగ్గింపు లభిస్తుందన్నమాట. 

అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.4,000 వరకు 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కొన్ని బ్యాంక్ కార్డులపై EMI ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్‌తో మరింత తక్కువ ధరకే Vivo X100 మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు.

Vivo X100 Specifications

Vivo X100 స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. MediaTek Dimensity 9300 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ZEISS -ట్యూన్డ్ 50MP Sony IMX920 ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రావైడ్, 64MP టెలిఫోటో లెన్స్ కెమెరాలు ఉన్నాయి. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ అందించారు. Android 14 ఆధారిత Funtouch OS 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. Vivo X100 స్టార్‌గేజ్ బ్లూ, ఆస్టరాయిడ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆసక్తి ఉన్న వారు త్వరగా కొనుక్కుంటే బెటర్.

Advertisment
Advertisment
తాజా కథనాలు