/rtv/media/media_files/2025/09/24/vivo-v60-lite-5g-smartphone-2025-09-24-21-04-13.jpg)
Vivo V60 Lite 5G smartphone
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో తన లైనప్‌లో ఉన్న మరో అదిరిపోయే మొబైల్‌ను లాంచ్ చేసింది. Vivo V60 Lite 5Gని మార్కెట్‌లో విడుదల చేసింది. V సిరీస్‌లోని ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Vivo V60 Lite 5G మొబైల్ 6,500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 90 W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15పై నడుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ తైవాన్‌లో విడుదల చేసింది.
Vivo V60 Lite 5G Price
Vivo V60 Lite 5G ధర విషయానికొస్తే.. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 38,000గా ఉంది. అదే సమయంలో 12GB + 256GB వేరియంట్ ధర రూ. 41,000గా కంపెనీ నిర్ణయించింది. ఇది టైటానియం మిస్ట్ బ్లూ, వైటాలిటీ పింక్, బ్లాక్ కలర్‌లో లభిస్తుంది.
Vivo V60 Lite 5G Specs
Vivo V60 Lite 5G మొబైల్ స్పెషిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది డ్యూయల్- సిమ్‌తో వస్తుంది. Vivo V60 Lite 5G మొబైల్ 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 6.77-అంగుళాల పూర్తి HD+ (1,080×2,392 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది Android 15 ఆధారంగా Funtouch OS 15పై నడుస్తుంది. Vivo V60 Lite 5G డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32-మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
Vivo V60 Lite 5G స్మార్ట్‌ఫోన్‌లో కనెక్టివిటీ కోసం Wi-Fi, బ్లూటూత్, GPS, OTG, USB టైప్-C పోర్ట్ ఆప్షన్‌లు ఉన్నాయి. దీనికి ఇ-కంపాస్, డిస్టెన్స్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, గైరోస్కోప్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా అందించారు. Vivo V60 Lite 5G శక్తి సామర్థ్యం విషయానికొస్తే.. 90 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,500 mAh బ్యాటరీని కలిగి ఉంది. దాని బ్యాటరీ 27 గంటల కంటే ఎక్కువ YouTube ప్లేబ్యాక్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది.