Vivo T4R 5G: వివో మామ అరాచకం.. కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలివే..!

Vivo T4R 5G మొబైల్ సేల్ ఈరోజు ప్రారంభం కానుంది. దీని ప్రారంభ ధర రూ. 19,499గా ఉంది. ఈ మొబైల్‌ను తొలి సేల్‌లో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ను రూ.17,499 ధరకే కొనుక్కోవచ్చు. ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI కూడా ఉంది.

New Update
Vivo T4R 5G

Vivo T4R 5G

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ vivo ఇటీవల Vivo T4R 5Gని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ నేటి నుండి (ఆగస్టు 5) భారతదేశంలో సేల్‌కు అందుబాటులో ఉండనుంది. Vivo T4R 5G మొబైల్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్ప్లే ప్యానెల్‌‌తో వస్తుంది. ఇప్పుడు దీని ధర, ఆఫర్‌లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం. 

Vivo T4R 5G Price & Offers

Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో

8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,499.
8 GB RAM+ 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,499.
12 GB RAM+ 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,499. 

ఈ హ్యాండ్‌సెట్‌ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్,  ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల నుండి కొనుక్కోవచ్చు. అలాగే మొదటి సేల్‌లో కస్టమర్లకు రూ.2 వేల తక్షణ తగ్గింపు లభిస్తుంది. అప్పుడు వరుసగా ఈ వేరియంట్లు రూ.17,499, రూ.19,499, రూ.21,499 ధరతో లభిస్తాయి.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీనికి నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆర్కిటిక్ వైట్, ట్విలైట్ బ్లూ కలర్‌లలో అందుబాటులో ఉంది. 

Vivo T4R 5G Specifications

Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ 6.77-అంగుళాల HDR10+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 1,800 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15పై నడుస్తుంది. ఇది దేశంలోనే అత్యంత సన్నని క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ అని వివో కంపెనీ పేర్కొంది. Vivo T4R 5G మొబైల్ 4 nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 

Vivo T4R 5G ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇది ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. దీని అన్ని కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి. దాని కెమెరా మాడ్యూల్‌లో ఆరా లైట్ రింగ్ ఫ్లాష్ యూనిట్ కూడా అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ 44 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,700 mAh బ్యాటరీని కలిగి ఉంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు.

Advertisment
తాజా కథనాలు