/rtv/media/media_files/2025/07/08/vivo-flying-drone-camera-phone-2025-07-08-11-33-14.jpg)
Vivo Flying Drone Camera Phone
Vivo Flying Drone Camera Phone:ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో త్వరలో Vivo Flying Drone Camera Phone ను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని Vivo Jovi V50 5G Drone పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇది ఎగురుతూ గాలిలో అద్భుతమైన క్వాలిటీతో ఫోటోలు, వీడియోలు తీయగలదు. ఇందులో DSLR లాంటి క్వాలిటీతో కూడిన ఫ్లయింగ్ కెమెరాను అమర్చారు. ఇది 5G, AI ఫీచర్లను కలిగి ఉంటుందని సమాచారం.
Also Read: Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద
Vivo Jovi V50 5G Specifications
Vivo Jovi V50 5G Drone స్మార్ట్‌ఫోన్ ముఖ్యంగా వ్లాగర్లు, టూరిస్టులు, కంటెంట్ క్రియేటర్ల కోసం రూపొందించబడినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా డ్రోన్ అవసరం లేకుండా ఈ ఫోన్ ద్వారానే గాల్లో నుంచి ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఈ Vivo Jovi V50 5G Drone ఫోన్‌లో ఒక చిన్న డ్రోన్‌ను అమర్చారు. అది అవసరమైనప్పుడు పైగి ఎగిరి ఫొటోలు క్యాప్చర్ చేస్తుంది.
Also Read:Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి
ఈ ఫోన్ బయటి వైపు ప్రీమియం, స్టైలిష్ గా కనిపిస్తుంది. మెటాలిక్ మెటీరియల్ తో నిర్మించారు. AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ డ్రోన్ కెమెరా కోసం ప్రత్యేకంగా రిమోట్ ఉండదు. కేవలం ఫోన్‌లోని కొన్ని సెట్టింగ్స్, యాప్‌ను ఉపయోగించి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో 4K వీడియో, 108MP కెమెరాను అందించారు. 15 మీటర్ల దూరం వరకు కవర్ చేస్తుంది.
Also Read: Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
ఇది 6.9-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 1440 x 3200 రిజల్యూషన్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB RAM, 256GB/512GB స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని అమర్చారు. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది.
Vivo Jovi V50 5G Price
Vivo Jovi V50 5G Drone ధర విషయానికొస్తే.. ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.89,999 ధరను కలిగి ఉంది. వివో డ్రోన్‌లో 60% రీసైకిల్ చేసిన అల్యూమినియం, బయో-బేస్డ్ ప్లాస్టిక్‌లను ఉపయోగించింది. Vivo Jovi V50 5G ఈ ఏడాది చివరిలో భారత, చైనీస్, యూరోపియన్ మార్కెట్లలో లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. ప్రీ-ఆర్డర్లు అక్టోబర్‌లో ప్రారంభమై నవంబర్‌లో డెలివరీ కానున్నాయి.
Also Read: Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్