/rtv/media/media_files/2025/03/21/GdirunIrAoMb0qG0qcpl.jpg)
Samsung Galaxy S25 Edge
Samsung Galaxy S25 Edge
టెక్ బ్రాండ్ శాంసంగ్ నుంచి మరోక కొత్త మోడల్ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన Galaxy Unpacked ఈవెంట్‌లో కంపెనీ Samsung Galaxy S25 Edge గురించి ఒక టీజర్ రిలీజ్ చేసింది. దీంతోపాటు ఈ మోడల్‌ను MWC 2025లో కూడా ప్రదర్శించింది. ఈ కొత్త స్లిమ్ మోడల్ Galaxy S25 సిరీస్‌లో భాగంగానే అందుబాటులోకి రాబోతున్నట్లు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!
ఇప్పటికే ఈ మోడల్‌లోని వనిల్లా Galaxy S25, Galaxy S25+, Galaxy S25 Ultra వంటి ఫోన్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి Galaxy S25 Edge చేరబోతుంది. అయితే Samsung కంపెనీ ఈ ఫోన్ లాంచ్ గురించి ఇంకా ఎలాంటి డేట్ ప్రకటించలేదు. అయినప్పటికీ ఒక టిప్‌స్టర్ దాని ఇండియా లాంచ్ టైమ్ గురించి వెల్లడించాడు. Galaxy S25 Edge స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌పై నడుస్తుందని తెలిపాడు. అంతేకాకుండా డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!
Price
ట్విట్టర్ (X)లోని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్.. గెలాక్సీ S25 Edge వచ్చే నెలలో భారతదేశంలో లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. గతంలో కూడా ఈ ఫోన్ లాంచ్ డేట్‌పై కొన్ని వార్తలు వచ్చాయి. దీనిని ఏప్రిల్ 16 లాంచ్ చేయనున్నట్లు టాక్ నడిచింది. అంతేకాకుండా ఈ ఫోన్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లాంచ్ అవుతందని తెలిసింది. Galaxy S25 Edge ధర దాదాపు రూ. 1,10,000 ఉండవచ్చని టిప్‌స్టర్ అభిప్రాయపడ్డారు.
Also Read : లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
Specifications
Samsung Galaxy S25 Edge ఫోన్ చాలా స్లిమ్‌గా ఉంటుంది. కెమెరా మాడ్యూల్ చుట్టూ 8.3mm మందాన్ని కలిగి ఉంటుంది. ఇది Galaxy S25 సిరీస్‌లో ఇప్పటి వరకు లాంచ్ అయిన వాటిలాగే Galaxy SoC Snapdragon 8 Eliteపై పనిచేసే అవకాశం ఉంది. ఈఫోన్ 12 GB RAMతో రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.66-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
Galaxy S25 Edge ఫోన్ Android 15-ఆధారిత One UI 7తో రన్ అవుతుంది. Galaxy AI ఫీచర్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 25W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌కు మద్దతుతో 3,900mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కెమెరా సెటప్‌లో 200-మెగాపిక్సెల్ సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉండవచ్చని ఆ టిప్‌స్టర్ అంచనా వేశాడు.