Oppo Reno14 5G Diwali Edition: జాతీయపక్షి నెమలి డిజైన్‌తో ఒప్పో రంగులు మార్చే కొత్త ఫోన్..

Oppo Reno14 5G Diwali Edition భారతదేశంలో లాంచ్ అయింది. ఇది ఫోన్ వెనుక భాగంలో ఉష్ణోగ్రత ఆధారంగా బ్లాక్ నుండి గోల్డ్ కలర్‌లోకి మారే 'గ్లోషిఫ్ట్ టెక్నాలజీ'తో వచ్చింది. దీపావళి థీమ్‌తో కూడిన మండలా ఆర్ట్ , నెమలి డిజైన్ ఉన్నాయి.

New Update
OPPO Reno14 5G Diwali Edition (1)

OPPO Reno14 5G Diwali Edition

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Oppo తాజాగా తన లైనప్‌లో ఉన్న మరో మొబైల్‌ను లాంచ్ చేసింది. Oppo Reno14 5G Diwali Editionను విడుదల చేసింది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలోని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. మండల సాంస్కృతిక డిజైన్లు, నెమళ్ళ డిజైన్లతో ఈ కొత్త ఫోన్ పండుగ వాతావరణాన్ని గుర్తు చేస్తుంది. ఇది హీట్ సెన్సిటివ్, కలర్ ఛేంజ్ టెక్నాలజీతో భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా వచ్చింది. ఈ Oppo Reno14 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. Oppo Reno14 5G మొబైల్ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

Oppo Reno14 5G Diwali Edition Price

Oppo Reno14 5G దీపావళి ఎడిషన్ 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 39,999గా ఉంది. స్పెషల్ ఫెస్టివల్ ఆఫర్‌లో దీనిని కేవలం రూ. 36,999 కే కొనుక్కోవచ్చు. వినియోగదారులు ఒప్పో ఈ-స్టోర్, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రిటైల్ స్టోర్ల నుండి కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవచ్చు.

Oppo Reno14 5G Diwali Edition Design 

Reno14 5G దీపావళి ఎడిషన్ డిజైన్‌ను భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించారు. ఇది ప్రతి భారతీయుడితో ప్రతిధ్వనించే చిహ్నాల ద్వారా దీనిని తీసుకొచ్చారు. ఇది భారతీయ సంప్రదాయాలను సూచించే మండలాన్ని కలిగి ఉంటుంది. అందమైన భారతదేశ జాతీయ పక్షి నెమలి, దైవిక రక్షణను కలిగి ఉంటుంది. వీటి చుట్టూ అగ్నిలాంటి జ్వాల ఆకారాలు ఉన్నాయి. ఇవి దీపావళి సమయంలో ఇళ్లను వెలిగించే దియాలను (దియాలు) సూచిస్తున్నాయి. 

Oppo Reno14 5G Diwali Edition Specs

Oppo Reno14 5G Diwali Edition లో 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్‌ఓఎస్ 15పై నడుస్తుంది. Oppo Reno14 5G ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ ఫోన్ AI హైపర్‌బూస్ట్ 2.0, AI లింక్‌బూస్ట్ 3.0 తో అనేక ఫీచర్లను కలిగి ఉంది. GenAI ఇంటిగ్రేషన్‌తో Oppo Reno14 5G AI ట్రాన్స్‌లేట్, AI వాయిస్‌స్క్రైబ్, AI మైండ్ స్పేస్, సర్కిల్ టు సెర్చ్ ‌తో సహా మరిన్ని ఫీచర్లను కలిగి ఉంది. 

Oppo Reno14 5G దీపావళి ఎడిషన్ భారతదేశంలో హీట్ సెన్సిటివ్ టెక్నాలజీతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్. దీని గ్లో షిఫ్ట్ టెక్నాలజీ బాడీ టెంపరేచర్ ఆధారంగా ఫోన్ వెనుక ప్యానెల్‌ను డీప్ ఫెస్టివల్ బ్లాక్ నుండి మెరిసే గోల్డ్ కలర్‌లోకి మారుస్తుంది. ఇది ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i, స్పాంజ్ బయోనిక్ కుషనింగ్‌తో ఆల్-రౌండ్ ఆర్మర్ ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది. Oppo Reno14 5G ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది.

కెమెరా సెటప్ విషయానికొస్తే.. Oppo Reno14 5G దీపావళి ఎడిషన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, వెనుక భాగంలో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది ఒప్పో అధునాతన హైపర్‌టోన్ ఇమేజింగ్ ఇంజిన్‌తో వస్తుంది. AI రీకంపోజ్, AI బెస్ట్ ఫేస్, AI పర్ఫెక్ట్ షాట్, AI ఎరేజర్, AI ఎడిటర్ 2.0 ఆధారంగా AI రిఫ్లెక్షన్ రిమూవర్ వంటి ఫీచర్లతో వచ్చింది.

Advertisment
తాజా కథనాలు