Oppo Find X9 Series: వాటర్ ప్రూఫ్ మొబైల్.. 16GB RAM, 200MP కెమెరా, 7500mAh బ్యాటరీతో దుమ్ములేపేస్తుంది..!

Oppo Find X9 Oppo Find X9 Pro స్మార్ట్ ఫోన్లు తాజాగా లాంచ్ అయ్యాయి. ఇవి 16GB RAM, 200MP కెమెరా, 7500mAh బ్యాటరీ, MediaTek Dimensity 9500 SoC ద్వారా శక్తిని పొందుతాయి. Android 16 ఆధారంగా పనిచేసే ColorOS 16 పై పనిచేస్తాయి.

New Update
Oppo Find X9 Oppo Find X9 Pro

Oppo Find X9 Oppo Find X9 Pro


ప్రముఖ టెక్ బ్రాండ్ Oppo తాజాగా తన Oppo Find X9, Oppo Find X9 Pro లను విడుదల చేసింది. ఈ ఫోన్లు MediaTek Dimensity 9500 SoC ద్వారా శక్తిని పొందుతాయి. Android 16 ఆధారంగా పనిచేసే ColorOS 16 పై పనిచేస్తాయి. ఈ రెండు ఫోన్లు 50-మెగాపిక్సెల్ ప్రధాన లెన్స్‌తో హాసెల్‌బ్లాడ్-ఆధారిత కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. ఈ ఫోన్‌లో 200MP పెరిస్కోప్ కెమెరా కూడా ఉంది. ఇప్పుడు ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం. 

Oppo Find X9 Price

Oppo Find X9 5 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 

12GB + 256GB వేరియంట్ ధర సుమారు రూ. 54,300 నుండి ప్రారంభమవుతుంది. 
12GB + 512GB వేరియంట్ ధర సుమారు రూ. 61,700.
16GB + 256GB వేరియంట్ ధర సుమారు రూ. 58,000. 
16GB + 512GB వేరియంట్ ధర సుమారు రూ. 65,400.
16GB + 1TB వేరియంట్ ధర సుమారు రూ. 71,600 గా కంపెనీ ఉంది.

Oppo Find X9 Pro Price

Oppo Find X9 Pro 4 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 

12GB + 256GB వేరియంట్ ధర దాదాపు రూ. 65,400.
12GB + 512GB వేరియంట్ ధర దాదాపు రూ. 70,300.
16GB + 512GB వేరియంట్ ధర దాదాపు రూ. 74,100.
16GB + 1TB వేరియంట్ ధర దాదాపు రూ. 82,700గా కంపెనీ నిర్ణయించింది.  

Oppo Find X9, Oppo Find X9 Pro specs

Oppo Find X9 Pro 6.78-అంగుళాల 1.5K (2772×1272 పిక్సెల్స్) LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే సమయంలో Find X9 6.59-అంగుళాల 1.5K (2760×1256 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ రెండు ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. 1800 నిట్‌ల గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్, 3600 నిట్‌ల లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తాయి. ఫోన్‌లోని ProXDR డిస్‌ప్లే HDRకి మద్దతు ఇస్తుంది. ఇది HDR వివిడ్, డాల్బీ విజన్, HDR10+లకు మద్దతు ఇస్తుంది. 

Oppo Find X9 Pro, Find X9 రెండూ Dimensity 9500 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందాయి. ఇవి 16GB RAM + 1TB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌లు Android 16-ఆధారిత ColorOS 16పై నడుస్తాయి. వివిధ రకాల AI టూల్స్, ఇమేజింగ్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటాయి. 

కెమెరాల విషయానికొస్తే.. Oppo Find X9లో 50-మెగాపిక్సెల్ సోనీ LYT-828 ప్రైమరీ సెన్సార్ ఉంది. దీనికి 50-మెగాపిక్సెల్ సోనీ LYT-600 పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ కూడా అందించారు. మూడవ కెమెరా 50-మెగాపిక్సెల్ శామ్‌సంగ్ JN5 అల్ట్రావైడ్ లెన్స్ తో వస్తుంది. ముందు భాగంలో ఫోన్ 32-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంది.

Oppo Find X9 Proలో కూడా 50-మెగాపిక్సెల్ సోనీ LYT-828 ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ శామ్‌సంగ్ JN5 అల్ట్రావైడ్ లెన్స్, 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంది. సెల్ఫీల కోసం ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 

Oppo Find X9 Pro ఫోన్ 7,500mAh, Find X9 ఫోన్ 7,025mAh బ్యాటరీలను కలిగి ఉన్నాయి. రెండు ఫోన్‌లు 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. ఇవి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP66, IP68, IP69 రేటింగ్ ను కలిగి ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు