/rtv/media/media_files/2025/06/08/pVzgXgp6EhdmLnCvEuoU.jpg)
OnePlus Pad 3
OnePlus మరో కొత్త టాబ్లెట్‌ను లాంచ్ చేసింది. తన లైనప్‌లో ఉన్న OnePlus Pad 3 ని విడుదల చేసింది. ఈ OnePlus Pad 3 టాబ్ శక్తివంతమైన హార్డ్‌వేర్, 13.2-అంగుళాల 3.4K డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 12,140mAh బ్యాటరీ, ఆక్సిజన్ OS 15 వంటి స్మార్ట్ AI ఫీచర్లను కలిగి ఉంది. టాబ్లెట్ డిజైన్ కూడా మునుపటి కంటే మరింత అద్భుతంగా ఉంది. ఇప్పుడు దీని ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read : అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు
OnePlus Pad 3 Specifications
OnePlus Pad 3 ధర భారతదేశంలో ప్రకటించబడలేదు. త్వరలో దీని ధర వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ OnePlus టాబ్లెట్ ఇతర ప్రపంచ మార్కెట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ టాబ్ స్టార్మ్ బ్లూ, ఫ్రాస్టెడ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో వచ్చింది. ఈ టాబ్ వెనుక భాగంలో ఎనిమిది స్పీకర్లు (నాలుగు వూఫర్లు, నాలుగు ట్వీటర్లు) ఉన్నాయి.
Also Read : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి
ఇది 13.2-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. 3.4K రిజల్యూషన్, 12-బిట్ కలర్, 315 PPI పిక్సెల్ డెన్సిటీని అందిస్తుంది. పనితీరు కోసం ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది 12GB+256GB, 16GB+512GB స్టోరేజ్ వేరియంట్‌లతో వస్తుంది. ఈ టాబ్లెట్ అధునాతన కూలింగ్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ టాబ్‌లో ముఖ్యమైన పార్ట్ బ్యాటరీ.
ఇది 12,140mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 6 గంటల AAA గేమింగ్, 17 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను టైంను అందిస్తుంది. OnePlus Pad 3లో OxygenOS 15 ముందే ఇన్‌స్టాల్ చేయబడింది. దీనిలో AI Writer, AI Summarize, Circle to Search, Google Gemini వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఓపెన్ కాన్వాస్ ఫీచర్ కూడా ఇందులో అప్‌గ్రేడ్ చేయబడింది. కొత్త కీబోర్డ్ పెద్ద కీక్యాప్‌లు, AI షార్ట్‌కట్ బటన్‌లతో వస్తుంది. ఇవి మాగ్నెటిక్ కనెక్షన్‌కి మద్దతు ఇస్తాయి.
Also Read: మద్యం తాగడం అనే పొరపాటు చేయకండి! మీ కాలేయం పాడైపోతుంది.. ఫ్రూఫ్ ఇదే!