/rtv/media/media_files/2025/09/30/october-launch-mobiles-2025-2025-09-30-14-26-49.jpg)
October Launch Mobiles 2025
దేశీయ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. పలు కొత్త కంపెనీలు రకరకాల ఫోన్లను మార్కెట్‌లో లాంచ్ చేసి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారులను కొత్త టెక్నాలజీతో అప్‌డేట్‌గా ఉంచడానికి కంపెనీలు వినూత్న ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను తరచూ విడుదల చేస్తున్నాయి. ఇక నేటితో సెప్టెంబర్ నెల ముగియనుంది.
రేపటి నుంచి అక్టోబర్ ప్రారంభం కానుంది. అందువల్ల అక్టోబర్ నెలలో పలు కొత్త ఫోన్లు లాంచ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Realme GT 8 Pro
Realme అక్టోబర్‌లో Realme GT 8 Proను భారత్‌లో లాంచ్ చేయనుంది. అయితే కంపెనీ లాంచ్ తేదీ ఇంకా వెల్లడించలేదు. Realme GT 8 Pro ఫోన్ భారతదేశంలో మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ప్రాసెసర్ ఫోన్ అవుతుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 7000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 2K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Realme GT 8 Pro.. 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రియల్‌మీ UI 7తో వస్తుంది.
Xiaomi 17
Xiaomi త్వరలో Snapdragon 8 Elite Gen 5 తో Xiaomi 17 ను భారతదేశంలో ప్రారంభించనుంది. ఈ ఫోన్ ఇటీవల చైనాలో లాంచ్ అయింది. Xiaomi 17.. 1-120Hz రిఫ్రెష్ రేట్, 3500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 రేటింగ్, Xiaomi డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ రక్షణను కలిగి ఉంది.
Vivo V60e
Vivo అక్టోబర్ 7న Vivo V60e ని భారత మార్కెట్లో విడుదల చేయనుంది. లీక్‌ల ప్రకారం.. Vivo V60e.. 200-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉన్న మొదటి ఫోన్ అవుతుంది. ఇది 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది MediaTek Dimensity 7360 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.
iQOO 15
iQOO అక్టోబర్ 2025 లో iQOO 15 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయనుంది. iQOO 15 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్‌లో 6.85-అంగుళాల 144Hz QHD డిస్‌ప్లే, Q3 గేమింగ్ చిప్, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటాయి. iQOO 15 కలర్ మారే బ్యాక్ డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది.
OnePlus 15
OnePlus అక్టోబర్ 2025లో OnePlus 15 ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ మొదట చైనాలో ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. OnePlus 15 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. OnePlus 15.. 120W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీతో శక్తిని పొందుతుంది.
Oppo Find X9 Series
Oppo అక్టోబర్ 16న Oppo Find X9 Seriesను విడుదల చేయబోతోంది. Oppo కొత్త ఫోన్‌లలో MediaTek Dimensity 9500 చిప్‌సెట్ ఉంటుంది. ఇది మొదట చైనాలో అందుబాటులో ఉంటుంది. తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడుతుంది. ఈ సిరీస్‌లో Find X9, Find X9 Pro, Ultra ఉండే ఛాన్స్ ఉంది. లీక్ ప్రకారం.. Find X9 6.59-అంగుళాల 120Hz 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది Dimensity 9500 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.
Motorola Edge 60 Neo
మోటరోలా భారత మార్కెట్లో Motorola Edge 60 Neoను పరిచయం చేయబోతోంది. ఈ ఫోన్‌లో 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 12GB RAM + 512GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంటుంది. ఈ మోటరోలా ఫోన్‌లో 6.36-అంగుళాల LTPO OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, ఫుల్ HD+ రిజల్యూషన్, 300 నిట్స్ బ్రైట్‌నెస్, HDR10+ ఉంటాయి. Motorola Edge 60 Neo ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటాయి. 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.