/rtv/media/media_files/2025/08/05/iphone-17-release-date-2-2025-08-05-12-37-21.jpg)
ఐఫోన్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన రకరకాల మోడల్స్ మొబైల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత ఏడాది లాంచ్ అయిన Iphone 16 సిరీస్ కూడా చాలా మందిని అట్రాక్ట్ చేసింది. ఇక ఇప్పుడు Iphone 17 సిరీస్ కూడా త్వరలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఆపిల్ కంపెనీ తన కొత్త Iphone 17 సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ మధ్య విడుదల చేసే అవకాశం ఉంది.
iphone 17 Release Date
ఈసారి కంపెనీ నాలుగు మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. వీటిలో IPHONE 17, IPHONE 17 PRO, IPHONE 17 PRO MAXతో పాటు కొత్త వేరియంట్ IPHONE 17 ఎయిర్ ఉండే అవకాశం ఉంది. ఈసారి ‘ప్లస్’ వేరియంట్‌ను కంపెనీ నిలిపివేసింది.
iphone 17 Series Price
అందుతున్న సమాచారం ప్రకారం.. ఐఫోన్ 17 ప్రారంభ ధర భారతదేశంలో దాదాపు రూ. 79,900ను కలిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. ఎక్కువ స్టోరేజ్ లేదా ప్రో వేరియంట్‌ల ధరలు దీని కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో.. అమెరికాలో IPHONE 17 బేస్ వేరియంట్ ధర దాదాపు $899 (సుమారు రూ.78000) ఉండే ఛాన్స్ ఉంది. దీనిబట్టి ఈ ధర భారతదేశం కంటే కాస్త తగ్గుతుందనే చెప్పాలి. అదే సమయంలో ఈ ఫోన్ ప్రారంభ ధర యుఎఇలో AED 3,799 (సుమారు రూ.90,000) ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే ఈసారి ఆపిల్ తన 17 సిరీస్ డిజైన్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయబోతోందని సమాచారం. ఇది ‘డెసర్ట్ టైటానియం’ అనే కొత్త కలర్ ఆప్షన్‌తో వస్తుంది. ప్రో, ప్రో మాక్స్ మోడల్స్ నాలుగు కలర్‌లలో అందుబాటులో ఉండనున్నాయి. అవి -బ్లాక్, వైట్, డార్క్ బ్లూ, డెసర్ట్ టైటానియం. IPhone 17, 17 ప్రో మోడల్స్ 6.3-అంగుళాల స్క్రీన్ కలిగి ఉండొచ్చు. IPhone 17 Air మోడల్ 6.6-అంగుళాల డిస్ప్లే, ప్రో మాక్స్ 6.9 -అంగుళాల డిస్ప్లే కలిగి ఉండే ఛాన్స్ ఉంది.
ఇది 6- ఎలిమెంట్ లెన్స్‌తో కొత్త 24MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. అదే సమయంలో ఐఫోన్ 17 ప్రో మాక్స్ కొత్త 48MP టెలిఫోటో లెన్స్‌తో వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఐఫోన్ 17 ఎయిర్ వెనుక 48MP సింగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈసారి ఆపిల్ మరింత శక్తివంతమైన, సమర్థవంతమైన ప్రాసెసర్‌తో వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.